కడుపుబ్బా నవ్వుకునే సినిమాలు ఈమధ్య కాలంలో చాలా రేర్‌ అని చెప్పాలి. కడుపు పట్టుకుని నవ్వుకునే సినిమాలైతే కంటికి కనిపించడంలేదు. ఆ కొరతను తీర్చేసింది సామజవరగమన. శ్రీ విష్ణు , రెబా మోనికా జాన్‌ కాంబినేషన్‌లో వివాహ భోజనంబు ఫేమ్‌ అబ్బరాజు డైరెక్షన్‌లో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజేష్‌ దండా నిర్మించారు. జూన్‌ 30 న రిలీజయిన సామజవరగమన అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. హిలేరియస్‌ ఫన్‌తో.. ఇనాన్మస్‌ టాక్‌ తెచ్చుకుని ప్రాఫిట్‌ దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర పాత్రికేయుల సమావేశంలో సామజవరగమన సక్సెస్‌ ఆనందాన్ని, రాబోయే సినిమాల విశేషాలతో పాటు గడిచిన సినిమాల లోటు పాట్ల గురించి కూడా పంచుకున్నారు.
సామజవరగమన స్క్రిప్ట్‌ను తన వద్దకు తీసుకొచ్చిన సందీప్‌కు థ్యాంక్స్‌ చెప్పుకున్నారు. ఈ స్క్రిప్ట్ చదవగానే శ్రీ విష్ణు , నరేష్‌ లు తప్ప వేరేవారు గుర్తురాలేదన్నారు. నరేష్‌ డేట్స్‌ కోసం రెండు నెలలు ఆగి.. డేట్స్ అడ్జస్ట్ అయ్యాకే సినిమాని మొదలుపెట్టారట. మీడియాకు ప్రివ్యూ షో వేసాక సినిమాపై మరింత బజ్‌ ఏర్పడింది. మౌత్‌ టాక్‌తో పాజిటివ్ రెస్పాన్స్‌ రావడంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్స్‌ ద్వారానే పది లక్షలు రాబట్టిందట. ఇది ఓ చిన్న సినిమాకి పెద్ద విజయమనే చెప్పాలి. శ్రీ విష్ణు, నరేష్‌ లు ఇంప్రవైజ్‌ చేసిన తీరు సినిమాకు ప్రధాన బలమయ్యిందన్నారు. సామజవరగమన తమిళ్‌లోనూ రీమేక్‌ చేయబోతున్నట్టు చెప్పారు.
ఇక భోళా శంకర్‌ విషయాలు కూడా పంచుకున్నారు. మెగాస్టార్‌తో పనిచేస్తుంటే పాజిటివ్ వైబ్స్ వుంటాయి. ఎంత టెన్షన్‌ ఉన్నా ఇట్టే తొలిగిపోతుంది. భోళా శంకర్‌ కూడా ఫ్యామిలీ డ్రామా.. చిరుకు పర్‌ఫెక్ట్ యాప్ట్ స్టోరీ.. చిరు, కీర్తి సురేష్‌ ల అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సీన్స్‌ అద్భుతంగా వచ్చాయన్నారు.
ఏజెంట్ ఫ్లాప్ విషయంపైనా స్పందించారు అనిల్‌ సుంకర. టీమ్‌ వర్క్‌ గా చేసినపుడు ఫ్లాపుల్లోనూ టీమ్‌ బాధ్యత ఉంటుంది. నిర్మాతగా ఏజెంట్ ఫ్లాప్ లో బాధ్యత వహిస్తున్నానన్నారు. సురేందర్‌ రెడ్డితో కలసి అఖిల్‌కు నెక్ట్స్‌ లెవల్‌ ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం చేసాం కానీ విఫలమయ్యామని ఒప్పుకున్నారు.
తాము చేయబోతున్న హిడింబ, ఊరిపేరు భైరవకోన లాంటి సినిమాలు అద్భుతంగా వస్తున్నాయన్నారు. హిడింబ ట్రైలర్‌ తోనే ఆకట్టుకుని టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందన్నారు. పెద్ద సినిమాలకు ఈక్వేషన్స్‌ ఉంటాయి.. చిన్న సినిమాలు కంటెంట్ బాగలేకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. నాన్ ధియేటర్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడక తప్పదన్నారు. రీరిలీజ్ ల ట్రెండ్ లపైనా స్పందించారు. నిర్మాతకు అడిషనల్ మనీ వస్తే అది ఇండస్ట్రీకి వచ్చినట్టేనన్నారు. ఇతర వ్యాపారాలతో పోల్చితే.. సినిమా వ్యాపారం భిన్నమైన తృప్తినిస్తుందన్నారు అనిల్‌ సుంకర.

Leave a comment

error: Content is protected !!