Shopping Cart 0 items - $0.00 0

రేపు అల .. విశాఖపట్నములో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  బాక్సాఫీస్ వద్ద తుఫాన్ కలెక్షన్స్ తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ మూవీ విడుదలై రేపటికి వారం అవుతుంది. అయినా సరే థియేటర్స్ వద్ద ఏ మాత్రం క్రౌడ్ తగ్గడం లేదు. సంక్రాంతి విన్నర్ ఇదేనంటూ భారీగా హంగామా చేస్తోన్న ఈ సినిమా టీమ్.. ఈ నెల 19న అంటే..  రేపే వైజాగ్ లో భారీ ఎత్తున సక్సెస్ సెలబ్రేషన్స్ జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది.  నిజానికి ఈ నెల 18నే  ఈ కార్యక్రమం జరుగుతుందని అల్లు అరవింద్ మీడియా సమక్షంలో తెలియచేశారు. కానీ.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల  రేపటికి వాయిదా పడింది.  

రేపు సాయంత్రం వైజాగ్ లో ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సంబరాల్ని భారీ గా జరపనున్నారు. ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది కాబట్టి.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉంది చిత్ర బృందం. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండియా వైజ్ గా .. ఉభయరాష్ట్రాలతో కలుపుకొని ఇప్పటికే వంద కోట్లు దాటిందని మరో రెండు రోజుల్లో 140కోట్లకు చేరుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రేపు ఈ చిత్ర బృందం ఎలాంటి ఫిగర్స్ చెబుతుందో ..  నిజానిజాలేంటో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!