‘ఒరు అడార్ లవ్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమాలో ఒకే ఒక్క పాటలోని కన్ను కొట్టే ఒక సీన్ తో ఆమె జాతకమే మారిపోయింది. ఆ ఒక్క షాట్ . భారతీయ తెరను ఊపేసింది. దాని అనువాద చిత్రం ‘లవర్స్ డే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమ్మడు . ఆ క్రేజ్ తోనే ప్రియాకు యువతలో పెద్దఎత్తున అభిమానులు ఏర్పడ్డారు . ప్రియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 7.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయినా సరే ఎందుకోగానీ.. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుంది.
దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రియా ప్రకాష్ అభిమానులు కలవరపడుతున్నారు. ప్రియా ట్రోల్‌ల వల్లనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే నిజంగా ఇందుకోసమే తప్పుకుందా లేదా మరేదైనా కారణం ఉందా చెప్పలేదు. ప్రస్తుతం తనే తాత్కాలింగా తప్పుకున్నట్లు చెప్పిందట. ఎప్పుడైనా తిరిగి రావొచ్చని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రియా ప్రకాష్ వారియర్ కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే కాదు మిగత సామాజిక మాధ్యమాల్లోను చాలా చురుగ్గా ఉంటుంది. బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ అనే చిత్రంలో నటించింది. అప్పట్లో ఈ చిత్రం పేరుపై వివాదం కూడా చెలరేగింది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్ కూడా నటించాడు. సినిమాపై దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా సినిమా టైటిల్ మార్చాల్సిందేనంటూ నిర్మాతలకు లీగల్ నోటీసులు కూడా ఇచ్చాడు.