Shopping Cart 0 items - $0.00 0

అనంతపురంలో మొదలైన ‘నారప్ప’

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న విలేజ్ రివెంజ్ స్టోరీ ‘నారప్ప’. ధనుష్ తమిళ హిట్  చిత్రం ‘అసురన్’ రీమేక్ వెర్షన్ అయిన ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నిన్న అర్ధరాత్రి ఈ మూవీ టైటిల్ తో ఉన్న ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన చిత్ర బృందం ఈ రోజు నుంచి అనంతపురంలో షూటింగ్ మొదలుపెట్టేసింది. అక్కడ జరిగే షెడ్యూల్ లో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకోనుంది.

వెంకీ సరసన ప్రియామణి కథానాయికగా నటించనున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి విలేజ్ మూవీని, అందులోనూ రివెంజ్ స్టోరీని ఎలా తెరకెక్కిస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ‘నారప్ప’ గా వెంకీ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!