ప్రభాస్ నటించబోయే కొత్త ప్రేమకథ చిత్రానికి ముహూర్తం ఖాయమైంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జులై నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైందని సినీ వర్గాల సమాచారం. ప్రేమ కథాంశంతో పాటు యాక్షన్ సన్నివేశాలతో కూడిన పీరియాడిక్ చిత్రంగా ఇది రూపొందనుంది.

హను రాఘవపూడి గత చిత్రం సీతారామం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే నాయిక ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎ.డి చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలైన వెంటనే ప్రభాస్ తన కొత్త ప్రేమాయణం చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Leave a comment

error: Content is protected !!