Prabhas : ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక బ్రాండ్. పాన్ ఇండియా అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చిన పెర్ఫెక్ట్ స్టార్ హీరో అతను. అతనితో సినిమా తీయాలంటే.. మినిమమ్ 500 కోట్ల బడ్జెట్ ఉండాలి. అంతలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకొన్న ఈ రెబల్ స్టార్ పుట్టినరోజు నేడు.
బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్, బాక్సాఫీస్ రికార్డులను తిరగ వ్రాస్తున్నారు. దేశంలోని ఏ ఇతర స్టార్ కంటే అతను బాక్సాఫీస్ నంబర్ గేమ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకూ థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా.
ప్రభాస్ సినిమాలకు ఓపెనింగ్స్ ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డే 1, ఫస్ట్ వీక్ రికార్డులు అతని సినిమాలకు మరో ప్రత్యేకత. బాహుబలి 2 లాంటి సినిమాలతో ప్రభాస్ వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు. ప్రభాస్ సినిమాలు ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఇది తెలుగు సినిమాకు మరో గర్వకారణం.
ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతగా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్‌లో భారీ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ స్థాయి. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాలను అందించాడు.
ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2 సినిమా కూడా భారీ అంచనాలతో సాగుతోంది. సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా.
ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. తన అద్భుతమైన నటన, మంచి మనసుతో అతను ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. భవిష్యత్తులో కూడా అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.