Shopping Cart 0 items - $0.00 0

డార్లింగ్ స్టైలిష్ లుక్

 

‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్ 20 వ చిత్రం  ‘జాన్’ (వర్కింగ్ టైటిల్ ) మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అవడానికి ముందు నుంచీ .. దాని తగ్గ ప్రచారాలు ప్రారంభించింది.  అందులోని  డార్లింగ్ స్టైలిష్ లుక్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది చిత్ర బృందం. ఒక పెద్ద పియానో దగ్గర ప్రభాస్ స్టైల్ గా నిలుచున్న సిల్హౌట్ లుక్ ను రివీల్ చేశారు. దాన్ని ఆనుకొనే మేడ మెట్లు ..  ఆ మెట్లు వెంబడే గోడకు తగిలించిన కొన్ని పెయింటింగ్స్ .

‘సాహో’ లో ప్రభాస్  పూర్తి స్థాయిలో  మాస్ గా రివీల్ అయితే… ఇందులో దానికి క్వయిట్  కాంట్రాస్ట్ లో చాలా క్లాస్ గా రివీలవడం విశేషం. అయితే దీన్నో పస్ట్ లుక్ లా కాకుండా.. షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన స్టిల్ గా విడుదల చేయడం  ఆసక్తిగా మారింది. అసలు ‘జాన్’ మూవీలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు, అతడి కేరక్టర్ ఏంటి? అనేది తెలియడం కోసమే దీన్ని ఫీలర్ గా వదిలారని చెప్పుకోవచ్చు.  ఇప్పటికే ఈ స్టిల్ తెగ వైరల్ అయిపోయింది. అందులో ప్రభాస్ కటౌట్ ను చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. అందాల పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.

Leave a comment

error: Content is protected !!