నటీనటులు: శ్రీరామ్, ఖుషీ రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు తదితరులు
దర్శకత్వం: సాయికిరణ్ దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
పాటలు: కవి సిద్దార్థ
మ్యూజిక్: కృష్ణ సౌరబ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫి: సతీష్ మనోహర్
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
ఫైట్స్: జష్వ
బ్యానర్: కళాహి మీడియా
రిలీజ్ డేట్: 2023-12-15

క్రైమ్‌ థ్రిల్లర్స్‌కి, హర్రర్‌ థ్రిల్లర్స్ కి మినిమమ్ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. ఎమోషన్‌తో కూడిన క్రైమ్‌ స్టోరీస్‌ చాలా వరకు సక్సెస్‌ సాధించాయి. ఈ జానర్స్‌ అన్నింటిని మిక్స్‌ చేసి రెడీ చేసిన సినిమా పిండం. సస్పెన్స్‌ సస్టెయిన్‌ చేస్తూ ఆడియెన్స్‌ ని ఆకట్టుకోవడం ఈ సినిమాల ప్రధాన లక్ష్యం. మరి డిసెంబర్ 15 , 2023 న రిలీజయిన పిండం సినిమా ఆకట్టుకుందా..? లేదా ? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

ఆంథోని (శ్రీరామ్) ఓ రైస్‌మిల్‌లో పనిచేస్తూంటాడు. ఇతనికి భార్య (ఖుషి రవి), తార, సోఫీ అనే ఇద్దరు కూతుళ్లు, తల్లి సూరమ్మ ఉంటారు. ఓ పురాతన ఇంటిని కొనుగోలు చేసి అక్కడ ఉంటుంటాడు. ఆ ఇంటిలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన భయానక పరిస్థితులు ఎదురవుతుంటాయి. భార్య గర్భిణి.. హాస్పిటల్‌ పాలవుతుది. అనుకోని రీతిలో తల్లి ప్రమాదానికి గురవుతుంది. వీటికి కారణం ఆ ఇంటిలో ఉన్న క్షుద్రశక్తులే నని భావించిన ఆంథోని అన్నమ్మ(ఈశ్వరి రావు) ఆమె సన్నిహితుడు అవసరాల శ్రీనివాస్‌ల సాయం కోరతాడు. వారు ఆ ఇంటిలో ఉన్న క్షుద్రశక్తిని వదిలించారా ? అసలు ఎవరీ క్షుద్రశక్తి ? ఆంథోని కుటుంబం సమస్యల నుంచి గట్టెక్కిందా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
ఓ పాడుబడ్డ ఇంటిని కొనుగోలు చేయడం..అందులో నివాసానికి వెళ్ళగానే సమస్యలు మొదలు కావడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఫార్ములా. అలవాటయిన ఫార్ములానే అయినా ఎప్పటికీ ఎంగేజ్‌ చేసే పాయింట్ సస్పెన్స్‌ మెయింటెన్ చేయగలగడం. అలా చేస్తేనే ఇలాంటి సినిమాలకు ప్రాణం ఉన్నట్టు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను డ్రైవ్ చేస్తూ.. హర్రర్‌తో భయపెడుతూ.. ఆసాంతం థ్రిల్‌ చేసే విధంగా పిండం చిత్ర దర్శకుడు సాయికిరణ్ కథ రాసుకున్నాడు. ముఖ్యంగా స్క్రీన్‌ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చాలా చక్కగా పండించాడు. దర్శకుడు భావానికి ఆర్టిస్టులు పండించిన విధానం ఇంకా బావుంది. సినిమాటోగ్రఫి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా మూడ్‌ని నెక్ట్స్ అద్భుతంగా మెయింటెన్ చేసిందని చెప్పాలి. ఆడియెన్స్‌ని కంప్లీట్‌గా ఎంగేజ్‌ చేస్తాయి.
సినిమా ఫస్టాఫ్‌ వరకు అద్భుతంగా సాగుతుంది. కథలో కాన్‌ఫ్లిక్ట్‌ను ప్రేక్షకుల ఆసక్తిని రెట్టించేలా ప్రజెంట్ చేసాడు డైరెక్టర్. సెకండాఫ్ కూడా అదే టెంపో మెయింటెన్ చేయడానికి ప్రయత్నించినా.. ఓ దశలో రొటీన్‌ ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్ ఆడియెన్స్‌ చలించేలా తీసాడు. క్లైమాక్స్‌ లో ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఆడియెన్స్‌ మంచి సినిమా చూసామనే భావనతో బయటకొస్తారు. మొదటి సినిమాతోనే అనుభవమున్న దర్శకుడనిపించుకున్నాడు సాయికిరణ్‌.

బోటమ్‌ లైన్‌ : హర్రర్‌ థ్రిల్లర్స్‌లో గట్టి పిండమే

Rating 2.75/5

Leave a comment

error: Content is protected !!