మన సినిమా హిట్టయితే తలెత్తుకుని తిరుగు తప్పులేదు.. అంతేకానీ ఎదుటోళ్లను కించపర్చొద్దు.. ఇవి విశ్వక్‌సేన్‌ మాటలు. తనపై వస్తున్న మీమ్స్‌కు , విమర్శలకు ఓ సినిమా వేదికగా సమాధానం చెప్పారు.  విశ్వక్‌సేన్‌ తన మిత్రుడు సన్నిహితుడైన రాకేష్‌ వర్రే  క్రేజీ యాంట్స్‌ బ్యానర్‌ పై నిర్మించిన పేక మేడలు మూవీ టీజర్‌ లాంచ్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు విశ్వక్‌సేన్‌.
బాహుబలి మూవీలో సేతుపతి పాత్రతో మంచి గుర్తింపు పొందిన రాకేష్‌ వర్రే.. ఎవ్వరికీ చెప్పొద్దు అనే మూవీని క్రేజీ యాంట్స్‌ బ్యానర్‌ స్థాపించి హీరోగా నటించారు. ఇప్పుడు నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో పేకమేడలు అనే మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నటించారు. ఈ చిత్ర టీజర్‌ను మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్ లాంచ్‌ చేసారు.
నా పేరు శివ,అంధగారం మూవీలో విలన్‌రోల్‌ భయపెట్టేలా నటించిన వినోద్ కిషన్‌ ఈ చిత్రంలో అద్భుతమైన ఈజ్‌ తో ఎంటర్‌టైన్‌ చేస్తాడంటున్నారు. విశ్వక్‌సేన్‌ రాబోయే సినిమాలో కూడా వినోద్‌ కిషన్‌ కీలక పాత్రలో భయపెట్టబోతున్నాడంటూ చెప్పారు విశ్వక్.  నిర్మాత రాకేష్‌ వర్రే సంకల్పం గొప్పదనీ, మంచి ఉద్దేశ్యంతో తలపెట్టే ప్రతీ పనీ పదిమందికి మంచి చేస్తూ విజయవంతమవుతుందన్నారు విశ్వక్‌సేన్‌. ప్రతీ టెక్నిషియన్‌ని, ఆర్టిస్ట్‌లను ప్రశంసిస్తూ ఈచిత్రం అద్భుత విజయం సాధించాలని కాంక్షించారు విశ్వక్‌సేన్.
అలాగే ఈ మధ్య తను ఓ డైరెక్టర్‌ కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదనీ, కనీసం కథ వినేందుకు కూడా ఆసక్తి చూపలేదని వస్తున్న వార్తలు, విమర్శలు, మీమ్స్ గురించి ప్రస్తావిస్తూ…. చేసే పనిపై అత్యంత క్లారిటీ ఉన్నపుడు ఎదుటివాళ్ళ టైమ్‌ వేస్ట్‌ చేయలేనని, చెయ్యాలనుకోని సినిమా కోసం  కథంతా విని ఆ తర్వాత రిజెక్ట్ చేయడం కరెక్ట్‌ కాదని, అలా వాళ్ల టైమ్‌ వేస్ట్ చెయ్యనని అందుకే ఆ డైరెక్టర్‌ అడిగినపుడు కథ వినకుండానే వద్దని చెప్పానన్నాడు.. అలాగే సదరు డైరెక్టర్‌ తీసిన సినిమా పెద్ద విజయం సాధించినపుడు డైరెక్టర్‌ గ్రూప్‌లో మొదట తానే కంగ్రాట్స్ చెప్పానని గుర్తుచేసారు. మన సినిమా హిట్టయితే తలెత్తుకో తప్పులేదు.. కానీ వేరేవాళ్లని కించపరచడం బాధగా ఉందన్నారు. నేను చిన్న హీరోనో, పెద్ద హీరోనో నా వర్క్‌ స్టైల్‌లో నేను బిజీగా ఉంటాను.. అందర్నీ హ్యాపీ చేయడానికి నేనేమీ బిర్యానీని కాదంటూ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు విశ్వక్‌. సినిమా హిట్టయితే కొంతమంది ఏడుస్తారు.. చాలామంది హ్యాపీ ఫీలవుతారు.. అలా ఏ సినిమా హిట్టయినా నేను హ్యాపీ ఫీలవుతాను.. అలాగే ఈ పేక మేడలు సినిమా కూడా తప్పకుండా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసారు.
విశ్వక్‌సేన్ కమిట్‌మెంట్ తనకు ఇష్టమనీ.. ఫలక్‌నుమాదాస్‌తో తనని తానే స్టార్‌ని చేసుకున్నాడనీ… ఎవ్వరికీ చెప్పొద్దు మూవీ తర్వాత 3 ఏళ్లకు ఈ సినిమా వస్తుండటంతో స్టాండర్డ్‌గా వర్క్‌షాప్‌ నిర్వహించి మరీ చేసామన్నారు. ఈ కథకు వినోద్ కిషన్‌, అనూష యాప్ట్‌ అన్నారు.
బస్తీలో సాగే ఈ కథలో నటించడం, ఈ పాత్ర నా కెరీర్‌లో బెస్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు  హీరో వినోద్ కిషన్‌.

Leave a comment

error: Content is protected !!