ప్రజెంట్ ఇండస్ట్రీ లో బాగా వినబడుతున్న పేరు నవీన్ పోలిశెట్టి. లేటెస్ట్ గా జాతిరత్నాలు మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈ హీరో కెరీర్ అంత సాఫీగా ఏమి సాగలేదు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా కి ముందు ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళి నో అనిపించుకున్నా కూడా ఈ హీరో తన దారిని మాత్రం మార్చుకోలేదు. ఇంగ్లిష్ మరియు హింది థియేటర్ చేసిన నవీన్ ఎన్నో నాటకాల్లో ఎన్నో పాత్రల తో ఆడియన్స్ ని మెప్పించారు. థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మాల్స్ లో జరిగే ఈవెంట్స్ కి హోస్ట్ గా వీటి తో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , వన్ నేనొక్కడినే చిత్రాల్లో చిన్న క్యారెక్టర్స్ లో కూడ యాక్ట్ చేసాడు.ఇలా ఎన్నో రకాలు గా వర్క్ చేసారు. 

ఐతే ఇలా వర్క్ చేసిన ప్రోగ్రాంస్ లో యాంకరింగ్ కూడ ఉంది. మస్తీ అనే మ్యూజిక్ చానల్ కోసం ధర్మేంద్ర , షారుఖ్ ఖాన్ , ఐశ్వర్య రాయి లాంటి టాప్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసారు. ఐతే ఈ ఇంటర్వ్యూస్ లో బాహుబలి సినిమా కి సంబందించి ప్రభాస్, రానా, తమన్నా ని కూడ 2015 లో ఇంటర్వ్యూ చేసారు. వీటీ తో పాటు తను యూ ట్యూబ్ వీడియోస్ కూడ ఎన్నో చేసి  తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకోని  ఈ రోజు ఓ విజేత గా నిలబడ్డాడు నవీన్ పోలిశెట్టి.

Bahubali team interview – Naveen Polishetty

Naveen interview with Rana

naveen interview with srk , varun, kriti

naveen interview with Aishwarya Rai

Leave a comment

error: Content is protected !!