Shopping Cart 0 items - $0.00 0

‘హిరణ్యకశ్యప’ కు రెడీ అవుతోన్న భళ్ళాల దేవుడు

గతేడాది యన్టీఆర్ సిరీస్ లో   చంద్రబాబునాయుడు గా నటించి మెప్పించిన రానా ..  అదే చేత్తో ‘హౌస్ పుల్4’ బాలీవుడ్ మూవీలోనూ, ధనుష్ ‘ఎన్నై నోకి పాయుమ్ తోట్టా’ మూవీలోనూ నటించాడు. అయితే అవేమీ  పూర్తి స్థాయి పాత్రలు కాదు. అసలు ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత రానా హీరోగా నటించిన మూవీ ఇంత వరకూ రానేలేదు. ప్రస్తుతం నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వేణు ఊడుగుల  ‘విరాట పర్వం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు రానా .  ఈ సినిమా   కేరళ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. దీని తర్వాత రానా .. గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ పౌరాణిక చిత్రంలో టైటిల్ రోల్ పోషించడానికి సన్నద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా మేజర్ పార్ట్ అందులోనే జరగనుంది.

వేసవిలో ‘విరాట పర్వం’ విడుదల కాగానే.. ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.   అలాగే.. ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కూడా పెర్ఫెక్ట్ గా జరగడానికి ప్లాన్ చేస్తున్నారు. భక్త ప్రహ్లాద ఇతి వృత్తంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా .. విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశ్యపునిగా నటించబోతున్నాడు. అయితే ఇక్కడో విశేషమేంటంటే.. క్రిష్  ‘కృష్ణంవందే జగద్గురుం’ మూవీ కోసం రానా . ఒక నాటకంలో భాగంగా నరసింహ స్వామిగా కనిపిస్తాడు. ఆ సినిమా క్లైమాక్స్ కోసం రానా వేసిన గెటప్ కు అప్పట్లో మంచి అప్లాజ్ వచ్చింది. అయితే అది ‘బాహుబలి’ ముందు వచ్చిన సినిమా కాబట్టి.. ఆ పాత్రకు అప్పట్లో అంతగా  కనెక్ట్ కాలేకపోయారు జనం .  పాన్ ఇండియా నటుడిగా ఎదిగిన రానా ఇప్పుడు .. అదే నరసింహ స్వామి చేతుల్లో వధింపబడే హిరణ్య కశ్యపుని గా నటించనుండడం ఆసక్తిగా మారింది. మరి హిరణ్య కశ్యపునిగా రానా ఏ స్థాయిలో తన నట విశ్వరూపం ప్రదర్శిస్తాడో  చూడాలి.

Leave a comment

error: Content is protected !!