నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ నుంచి ప్రొడ్యూస్ అయిన క్రేజీ మూవీస్ హిట్ 1, హిట్ 2.. రెండూ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు నాని లీడ్ రోల్ ప్లే చేస్తూ ‘HIT: The 3rd Case’ రాబోతుంది. వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శైలేష్ కొలను డైరెక్టర్ కాగా, ప్రశాంతి తిపిర్నేని ప్రొడ్యూసర్.
నాని లీడ్ రోల్‌లో హిట్ 3 రాబోతుందన్న వార్త తెలిసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా నాని యాక్టింగ్ చూడటానికి ఆసక్తిగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 2025 కొత్త సంవత్సరం కానుకగా హిట్ 3 నుంచి నాని ఇంటెన్స్‌లుక్‌తో పోస్టర్ రిలీజ్ చేసారు. డైనమిక్ , రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో నాని ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
