Shopping Cart 0 items - $0.00 0

మనసును తాకే ‘జాను’ ఫస్ట్ సింగిల్

 

96’ సూపర్ హిట్ తమిళ మూవీ తెలుగులో శర్వానంద్, సమంతా జంటగా  ‘జాను’ పేరుతో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి , త్రిష అభినయం తమిళ తంబీల హృదయాల్ని తాకింది. అందుకే ఆ ఫీల్ ను అలాగే  కంటిన్యూ చేయడానికి సి. ప్రేమ్ కుమార్ నే మళ్ళీ దర్శకుడిగా తీసుకున్నారు. అలాగే ఈ మూవీకి ఒరిజినల్ వెర్షన్ కు బాణీలు కట్టిన  గోవింద వసంతా నే సంగీత దర్శకుడిగా ఎంపికచేశారు.  ఇటీవల విడుదలైన ‘జాను’  టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను కూడా నిన్న సాయంత్రం  విడుదల చేశారు.

‘ప్రాణం’ అంటూ సాగే .. లిరికల్ సాంగ్..  వీడియో రూపంలో విడుదలైంది. తమిళ వెర్షన్ లో ఇదే పాట ‘తీరా..’ గా సూపర్ హిట్టైంది. అదే బాణీలో  సాగే ఈ పాటను గోవింద వసంతా , చిన్మయి ఆలపించారు. శ్రావ్యమైన ఈ గీతం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ‘జాను’ పిరియాడికల్ లవ్ స్టోరీ త్వరలో విడుదల కానుంది.

వీడియో సాంగ్ ను వీక్షించడానికి కింద లింక్ క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=7&v=FN882IStNCA&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!