యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ‘అశ్వథ్థామ’ మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా నాగశౌర్య 20వ చిత్రం అవడం విశేషం. 2011లో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోడు .. సరిగ్గా 9 ఏళ్ళ వ్యవధిలో 19 చిత్రాలు పూర్తి చేసి సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్న చిత్రంతో డిఫరెంట్ గా ఎలివేట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజే విడుదల చేశారు.

ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ మంచి హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య ఓ  ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలోని చిత్రంలో నటిస్తూండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో విల్లంబులు చేతబట్టిన నాగశౌర్య లుక్  కు మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ సినిమాతో శౌర్య ఏ రేంజ్ హిట్టు కొడతాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!