Shopping Cart 0 items - $0.00 0

రానా.. రాక్షసరాజ్యంలో రావణాసురుడా?

బాహుబలి’ లాంటి హ్యూజ్ హిట్టు తర్వాత దగ్గుబాటి రానా రేంజే మారిపోయింది. కొత్త  చిత్రాలన్నిటినీ పాన్ ఇండియా కేటగిరిలో..  బహుభాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం  ‘హాథీమేరా సాథీ, విరాటపర్వం‘ మూవీస్ ను ఆ విధంగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అలాగే గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ మూవీను కూడా అదే రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేసేందుకు ముందునుంచీ ప్రిపేర్ అవుతున్నాడు. ఇవే కాకుండా ఇప్పుడు రానా మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను కూడా లాక్ చేశాడని తెలుస్తోంది. 

తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనేరాజు నేనే మంత్రి’ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ క్రెడిట్ తోనే తేజ ఇప్పుడు రానాతో మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో రానా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయబోతున్నాడని , మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన చిత్రానికి ‘రాక్షసరాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘విరాటపర్వం , హిరణ్యకశ్యప’ చిత్రాల తర్వాత రానా చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. మరి ఈ మూవీ  రానాకి ఏ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!