బేబీ.. చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ అయ్యింది. కల్ట్ బ్లాక్ బస్టర్ అంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలకు, ఆర్‌ఆర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ బేబీ సినిమాతో పాటు తన కెరీర్ విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు.
బేబీ చిత్రం ఆఫర్ ఎలా వచ్చిందో విజయ్ బుల్గానిన్ స్పందిస్తూ.. “లాక్ డౌన్‌లో కాకినాడలో ఉన్నాను. ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నా. నా మ్యూజిక్ అంటే సార్‌కి ఇష్టం. డైరెక్టర్ గారు వచ్చి మూవీ చేద్దామన్నారు. వీడియోకాల్‌లో స్క్రిప్ట్ చెప్పారు. 6 సాంగ్స్ ట్యూన్ చేయాలన్నారు. టఫెస్ట్ ఏంటో అది కంప్లీట్ చేద్దామన్నాను. ప్రేమిస్తున్నా సాంగ్ సిచ్యుయేషన్ చెప్పారు. కంపోజ్ చేస్తే బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యింది. 2,3 డేస్‌లో ట్యూన్స్ అన్నీ కంపోజ్ చేసాను. సింగర్ తో పాడించి పంపించాను. వారికి వినగానే నచ్చింది.
మెలోడీస్ చేయగలిగే అన్నీ చేయొచ్చనేది నా ఫీలింగ్. మాస్ సాంగ్స్‌లోనూ మెలోడీ ఉంటుంది. దేవిశ్రీ, తమన్ సాంగ్స్‌లో కూడా మెలోడీ ఉంటుంది. ఇందులో 2 థీమ్స్ ఉపయోగించాం. ఒకే గానీ ట్యూన్ ని తర్వాత ఇంప్రవైజ్ చేసి ఉపయోగించాం. చంటిపిల్లలా సాంగ్ సినిమా అయ్యాక ఆర్ ఆర్ కంప్లీట్ అయ్యాక ట్యూన్ చేసా “ అన్నారు. అలాగే
“అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద చెప్పినవి బెస్ట్ కాంప్లిమెంట్స్. నాని గారు మెసేజ్ చేసారు. నా కెరీర్ కు బేబీ మంచి బ్రేక్ అనుకోవాలి. అన్ని పాటలు బెస్టే ఇస్తాం కానీ బేబీతో మంచి పేరు వచ్చింది. నేను చేసిన ట్యూన్స్ సాయిరాజేష్ గారికి వెంటనే నచ్చేసాయి. ఇందులో ప్లస్ ఏంటంటే..అన్ని ట్యూన్స్‌లో మంచి మెలోడీ ఉంటుంది. అవి ఎక్కడైనా ఉపయోగించొచ్చు. అలా ట్యూన్ చేసా ” అన్నారు.
సాయి రాజేష్‌తో పరిచయం గురించి వివరిస్తూ.. “నేను కాకినాడలో ఉన్నపుడు నాకేం తెలియలేదు.. సినిమా ఓపెనింగ్ కి వచ్చినపుడు సాయిరాజేష్‌తో ఎలా పడతన్నావ్ అని అడిగినవారున్నారు. ఆర్ ఆర్ టైమ్‌లో టార్చర్ ఉంటుందని చెప్పేవారు. కానీ నాకెలాంటి ఇబ్బంది కలగలేదు. సాయి రాజేష్ గారితో మంచి కో ఆర్డినేషన్ ఉంది. నేను చెప్పింది సెన్స్ అనిపిస్తే సాయిరాజేష్ వినేవారు.. ఆయన చెప్పినపుడు నేను వినేవాడిని. ఈ సినిమా రిలీజయ్యే వరకు ఏ సినిమాలు ఒప్పుకోలేదు. అల్లు అరవింద్ గారే మా బ్యానర్‌లో చేస్తావా అని అడిగారు.. చాలా హ్యాపీ ఫీలయ్యా ” అన్నారు విజయ్ బుల్గానిన్.
ఇక తన వ్యక్తిగత జీవితం, మ్యూజిక్ పట్ల ఆకర్షణ గురించి చెప్తూ.. ” ట్యూన్స్ బ్యాంకింగ్ పెట్టుకునే అలువాటు లేదు. మాది రామచంద్రాపురం పక్కన పల్లెటూరు. ఊర్లో సరిగా చదువుకోవట్లేదని రామచంద్రాపురం స్కూల్ లో వేసారు. మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక చదవలేకపోవడంతో ఇక ఇంట్లో చెప్పక తప్పలేదు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతానంటే ఇంట్లో భయపడ్డారు. కానీ ఎంకరేజ్ చేసారు ” అన్నారు విజయ్ బుల్గానిన్.
సినిమా అవకాశాల గురించి వివరిస్తూ.. “ నాకు ఇన్‌స్పిరేషన్ ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణి గారు. అయితే ఇక్కడికి రావడానికి కారణం సత్యమూర్తిగారని మా పెదనాన్న. వారి ఎంకరేజ్‌మెంట్తో ఇక్కడికి వచ్చాను. సినిమా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ నుంచి సినిమా మ్యూజిక్ వరకు వచ్చాను. మొదట్లో కమెడియన్ సినిమాలకు చేసానని కొంతమంది వేరే రకంగా అన్నారు. ఇండిపెండెంట్ మ్యూజిక్‌తో నా టాలెంట్ గుర్తించారు. డైరెక్టర్ వశిష్ఠ నా ఫ్రెండ్ . అతని ద్వారా సాయిరాజేష్ గారి పరిచయం. అలా సినిమాల్లోకి వచ్చాను. సప్తగిరితో పరిచయం బాగా ఉపయోగపడింది” అంటూ తన అనుభవాలు పంచుకున్నారు బేబీ చిత్ర సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్.