శాస్త్రీయ సంగీతంలో మణిపూస గా కీర్తి ప్రతిష్ఠలు గడించిన గాయని యం.యస్.సుబ్బలక్ష్మి అచ్చమైన తమిళురాలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఆమె తమిళనాట ఎక్కడ కచేరి చేస్తే అక్కడ కిక్కిరిసిన జనం ఉండేవారట. ఇప్పుడు సినిమా హాళ్ళు లోపల బైట ఎంత మంది జనం గుమిగూడతారో .. సరిగ్గా ఆమె సంగీత కచేరీలకు మందల కొద్దీ జనం వచ్చి వాలిపోయేవారట. అలాగే.. అదే సమయంలో తమిళనాట జి,యన్. బాలసుబ్రహ్మణ్యం అనే గాత్ర సంగీత విద్వాంసుడు కూడా ఉండేవారు. ఇద్దరి పాటలకీ మద్రాసు ఆడిటోరియమ్స్ కిటకిటలాడిపోయేవట. అందుకే వీరిద్దరినీ సినిమా తెరమీద చూపిస్తే .. ఇంకెంత క్రేజ్ వస్తుందో నని ఒక నిర్మాత ఆలోచించాడట. దాని ఫలితమే ..‘శకుంతల’ సినిమా. 1941లో వచ్చిన ఈ సినిమాలో ఏకంగా 40 పాటలున్నాయట. శకుంతలగా యం.యస్ .సుబ్బలక్ష్మి, దుష్యంతుడుగా జి,యన్. బాలసుబ్రహ్మణ్యం తామే పాడి అభినయించగా.. ఈ సినిమాను జనం తండోపతండాలుగా తరలివచ్చి చూశారట. అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్.