సోషల్ మీడియా, డేటింగ్ , వీడియో ఛాటింగ్ తో పక్కదారి పడుతోన్న యువతను మేల్కొలిపే కథాంశంతో వస్తోన్న న్యూ వేవ్ మూవీ ‘మిస్టర్ అండ్ మిస్’. యూత్ ను ఎట్రాక్ట్ చేసే సరికొత్త కథాకథనాలతో క్రౌడ్ ఫండెడ్ మూవీగా ఈ  సినిమాను అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా  లాంచ్ చేసింది చిత్ర యూనిట్.

ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్‌లో ఉంటారు. ఈ కథలో ఈ జంటలో ఒకరి మైబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్  రిలేట్ అయ్యే కంటెంట్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను  వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

LINK – https://www.youtube.com/watch?v=JaGQgtUQggk

Leave a comment

error: Content is protected !!