ఈ లాక్ డౌన్ టైమ్ లో జనానికి వినోదం అందించడమే పనిగా పెట్టుకున్నాయి కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ . ఈ నేపథ్యంలో జీ5 ఓటీటీ నుంచి విడుదల కానున్న మరో తెలుగు వెబ్ సిరీస్  ‘మేకసూరి’. త్రినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ ను  సింబా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో కార్తిక్ కంచెర్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ను ఈ నెల 31న జీ5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ క్రమంలో ప్రచారంలో భాగంగా ఈ వెబ్ సిరీస్  ట్రైలర్ ను యంగ్ హీరో నారా రోహిత్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సూరిది కసాయి వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక’ అయిపోయింది. అతడి ఊరిలో రాణి అని అందమైన అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! మగజాతి మనసు దోచిన రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తులపై సూరి ఎలా పగతీర్చుకున్నాడనేది ‘మేకసూరి’ వెబ్ సిరీస్ స్టోరీ. మరి ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో జనాన్ని ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!