నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు….
రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్
ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు
ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్
సంగీతం: జో ఎన్మవ్
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
పాటలు: వియస్ ముఖేష్, జో ఎన్మవ్
బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి
కొరియోగ్రఫీ: రాకీ
ఆర్ట్ డైరెక్టర్: సంజన కంచల
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రియాంక పాండ
పోస్టర్ డిజైనర్: రానా
పీఆర్వో: తిరుమలశెట్టి వెంకటేష్

విడుదల తేది : ఏప్రిల్ 19, 2024

 

కథ :  హీరో ( పార్వ‌తీశం ) సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి. మ్యారేజ్ విష‌యంలో ఇండిపెండెంట్‌గా బ‌తికే అమ్మాయి త‌న‌కు భార్య‌గా రావాలనేది హీరో ఆశ. కట్నం ఎక్కువగా ఇచ్చే పిల్ల తోనే పెళ్ళి జరిపించాలనేది హీరో తండ్రి (కేదార్ శంక‌ర్‌) ఆలోచన.
తండ్రి తీసుకొచ్చిన ప్రొపోజల్స్ ని రిజెక్ట్ చేస్తు మార్యేజ్ చేసుకోకుండా తప్పించుకుంటున్న హీరో కు కూర‌గాయలు అమ్ముతూ త‌న కుటుంబాన్ని పోషించుకునే మ‌హాల‌క్ష్మి (ప్రణీకాన్వికా) ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌హాల‌క్ష్మినే పెళ్లి చేసుకోవాల‌ని హీరో ఫిక్స‌వుతాడు. మ‌హాల‌క్ష్మి మాత్రం అత‌డి ప్ర‌పోజ‌ల్‌ను రిజెక్ట్ చేస్తుంది? మ‌హాల‌క్ష్మి ప్రేమ‌ను గెలుచుకోవ‌డానికి హీరో ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? మ‌హాల‌క్ష్మి ఎందుకు హీరో ప్రేమ‌ను రిజెక్ట్ చేసింది? మ‌హాల‌క్ష్మి కుటుంబ‌నేప‌థ్య‌మేమిటి? మ‌హాల‌క్ష్మి ప్రేమ కోసం హీరో ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు? హీరో ప్రేమ‌ను తొలుత తిర‌స్క‌రించిన అత‌డి తండ్రి కొడుకు మంచి మ‌న‌సును ఎలా అర్థం చేసుకున్నాడు? అన్న‌దే మార్కెట్ మ‌హాల‌క్ష్మి క‌థ‌.

 

విశ్లేషణ :  ఈ సినిమా లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి , కూర‌గాయలు అమ్మే అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడ‌నే పాయింట్‌ చాలా కొత్త గా ఉంది. ఈ పాయింట్ తో సినిమాలు చాలా తక్కువ. ఈ విషయం లో డైరెక్టర్ ముఖేష్ సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా మ‌హిళా సాధికార‌త‌ను చాటిచెప్పే ఓ మెసేజ్‌ కూడ ఇందులో ఉంది. యువ‌త ఆలోచ‌న‌లు పెళ్లి విష‌యంలో ఎలా ఉంటున్నాయి… క‌ట్నాల సంస్కృతి, సంప్ర‌దాయాల పేరుతో ఆడ‌పిల్ల‌ల‌కు జ‌రిగే అన్యాయం, పెళ్ళి తర్వాత అమ్మాయి లైఫ్ లో జరిగే మార్పులను క‌న్వీన్సింగ్‌గా మార్కెట్ మ‌హాల‌క్ష్మీ లో డైరెక్టర్ చూపించారు.కామెడీ అనుకున్న రేంజ్ లో పండలేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే కథానాయకుడు మార్కెట్‌ సెంటర్ లో షాప్ పెట్టుకొనే సన్నివేశాల్లో కామెడీ డోసు మరింత పెంచితే బాగుండనిపిస్తుంది. ప్రేమకథలో సహజత్వం లోపించినట్టుగా అనిపిస్తుంది. 

నటీనటులు : పార్వతీశం అభినయం అద్భుతం కూర‌గాయలు అమ్ముకునే హీరోయిన్ తో లవ్ లో ప‌డ్డ సాఫ్ట్ బాయ్ గా పార్వతీశం అభినయం అద్భుతం అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అతడి మెచ్యూరిటీ కనిపిస్తుంది. నటన ప‌రంగా హీరోయిన్ ప్రణీకాన్వికకి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఇది తొలి సినిమా అయినా మాస్ పాత్రలో జీవించింది. కొన్ని సీన్స్‌లో హీరోనే డామినేట్ చేసింది. . ముక్కు అవినాష్‌, బాషా కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదనిపించుకుంది. హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.లోపాలున్నాయి…కానీ మార్కెట్ మ‌హాల‌క్ష్మి మూవీ మంచి సందేశంతో తెర‌కెక్కిన చక్కటి లవ్ స్టోరీ . కథాకథనాల పరంగా.. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటిని లైట్ తీసుకొని సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

 రేటింగ్: 3/5
బాటమ్ లైన్:  సందేశంతో తెర‌కెక్కిన మార్కెట్ మ‌హాల‌క్ష్మి

Leave a comment

error: Content is protected !!