సినిమా: ‘లాట్స్ ఆఫ్ లవ్’
విడుదల తేదీ: 30-09-2022
నటీనటులు: డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన తదితరులు
సంగీతం: విశ్వ
ఎడిటర్స్: శ్రీనివాస్, నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: మురళీ, నగేష్, కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బి.కె. కిరణ్ కుమార్
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: డా. విశ్వానంద్ పటార్

ప్రేమ అనే కధాంశం తో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి… ఇందులో చాల బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి….. అందులో కొన్ని
.అట్టర్ ఫ్లాప్ కూడ అయ్యాయి.ఐతే  ఇదే లైన్ తో వచ్చిన ‘లాట్స్ ఆఫ్ లవ్’ చిత్రం ఎలా ఉందనేది…ఈ రివ్యూ లో చూద్దాం

కథ:
కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు అల్లాడిపోతుంటే చూసి తట్టుకోలేక వారి కోసం ఏమైనా చేయాలని తపించే డాక్టర్.. మనోహర్ (విశ్వానంద్ పటార్). కానీ తను అనుకున్న పనిని చేయడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. నామమాత్రపు ఫీజుతో చికిత్స చేస్తూ.. జనాలకు సేవ చేసే మనోహర్ అప్పులలో కూరుకుపోతాడు. మరి అతని తపన ఎలా తీరింది? అతనికి, స్కూల్ టీచర్ సరిత (ఆద్య)కు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది?

కాలేజ్‌కు బస్సులో వెళుతున్న రాకేష్ (నిహాంత్).. అదే బస్సులో నిలబడి ఉన్న మనోజ(దివ్య)కు సీటిచ్చి.. ఆ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. కానీ వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోరు. అందుకు కారణం ఏమిటి?

ఒక అనాథ అయిన రాజు (రాజేష్) ఎంతో కష్టపడి.. పెద్ద పేరున్న కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. అతని సక్సెస్‌కు కారణమైన రజిని (భావన)ను ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ రజినీ ఫ్యామిలీ రాజు అనాథ అని పెళ్లికి ఒప్పుకోరు. మరి వారి పెళ్లి ఎలా జరిగింది? అసలతను అనాథ ఎలా అయ్యాడు?

ప్రస్తుత ప్రపంచ తీరు గురించి, దేవుడి గురించి తత్వం బోధించే స్వామిజీ (కిరణ్)కి, ఎవరు కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ చేయూతనందించే ఎన్‌జిఓ సంయుక్త (మాధవి)కి ఉన్న సంబంధం ఏమిటి?

పైన చెప్పుకున్న నాలుగు కథలకు.. డబ్బుతో, రౌడీయిజంతో.. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పొగరబోతు జమీందారు (తెనాలి పంతులు), అతని కొడుకులకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘లాట్స్ ఆఫ్ లవ్’ స్టోరీ.

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో మెయిన్ పాత్రను చేయడమే కాకుండా.. సినిమాకు సంబంధించి పలు బాధ్యతలను దర్శకుడు విశ్వానంద్ పటార్ పోషించారు. కరోనా రోగులకు సేవ చేయాలనే తపన కలిగిన డాక్టర్‌గా, తల్లి కోరికను తీర్చాలనుకునే కొడుకుగా, ప్రేమికుడిగా.. ఇలా వైవిధ్యభరితంగా ఉండే మనోహర్ పాత్రలో విశ్వానంద్ ఆకట్టుకుంటాడు. ఆయన ప్రియురాలిగా చేసిన సరిత.. కాలేజ్ స్టూడెంట్స్‌గా చేసిన నిహాంత్, దివ్య.. అనాథగా చేసిన రాజేష్, అతనికి సపోర్ట్‌గా చేసిన భావన వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు ణ్ఘోగా చేసిన మాధవి, స్వామిజీ పాత్రలో కిరణ్ హుందాగా కనిపించారు. ఇక విలన్‌గా జమీందార్ పాత్రలో చేసిన తెనాలి పంతులు, ఆయన కొడుకులుగా చేసిన ప్రవీణ్, శ్రీను, రాఘవేంద్రలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మంచి పాత్రలు పడితే.. విలన్లుగా వారు కొంతకాలం అలరించే అవకాశం ఉంది. ఇంకా మిగతా పాత్రలలో నటించిన వారు కూడా ఓకే. సాంకేతికంగా.. సినిమాకు తగినట్లుగా సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ ఉంది. డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రెండు పాటలు బాగున్నాయి. దర్శకుడు విశ్వానంద్ పటార్.. ఆయన నటించడమే కాకుండా.. భారీ తారాగణంతో.. ఓ నాలుగైదు కథలను మిక్స్ చేసి.. అందులోనూ ఓ మెసేజ్‌ని చొప్పించి.. తన మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఓవరాల్‌గా అయితే.. ప్రేమ పేరుతో ఓ మంచి మెసేజ్ అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు ఇస్తుంది.

ట్యాగ్‌లైన్:  సందేశాత్మక చిత్రం

రేటింగ్: 3.25/5

Leave a comment

error: Content is protected !!