SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలోని భారీ బడ్జెట్ చిత్రం పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాని SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ లో పిలుస్తున్నారు. ఈ సినిమా ఒక అంతర్జాతీయ స్థాయి అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. విస్తృతమైన ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించేలా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
కథలో అడవులు కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకోసం సహజమైన అడవులను లొకేషన్‌లుగా ఎంచుకునే పనిలో ప్రస్తుతం చిత్ర బృందముంది. అలాగే.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్భుతంగా ఉపయోగించడం తెలిసిందే. ఈ సినిమా కోసం కృత్రిమ మేధ (ఏఐ) గురించి అధ్యయనం చేయడానికి రాజమౌళి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించారు. మహేశ్ బాబు నటిస్తోన్న 29వ చిత్రమిది. అతను ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.