కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ “విడా ముయర్చి” షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఆయన తదుపరి చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ”లో నటించబోతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించనుంది.
కోలీవుడ్‌ తాజా సమాచారం ప్రకారం, అజిత్ ఈ చిత్రంలో మూడు వేరువేరు లుక్‌లలో కనిపించనున్నారు. తను రెగ్యులర్ గా కనిపించే.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో పాటు, యువ లుక్‌తో నల్లటి జుట్టుతో కూడా అజిత్ కనిపిస్తారని.. కొన్ని సన్నివేశాల్లో పోనీటెయిల్‌ లుక్ తో కూడా కనిపిస్తారని సమాచారం.

దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ అజిత్ కోసం స్ట్రాంగ్ కేరక్టరైజేషన్ రాసుకున్నాడు. ఇంకా కథానాయిక పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కొన్ని రోజుల క్రితం, శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందనే ఊహాగానాలు షికారు చేశాయి కానీ, ఇంకా ఏమీ నిర్దారణ కాలేదు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!