చాలా తక్కువ వయసులో బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంటరయ్యాడు. అదే ఏజ్ లో నిర్మాతగానూ అవతరించాడు. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన … అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో బడా మేకర్ గా నిలబడగలిగాడు. ఆయన పేరు కరణ్ జోహార్.  బాలీవుడ్లో ఇప్పుడాయన నెంబర్ వన్ దర్శక, నిర్మాత. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించే బహుముఖ సృజనశీలి కరణ్‌ జోహార్‌.

బాలీవుడ్‌ నిర్మాత, ధర్మాప్రొడక్షన్స్‌ అధినేత యాష్‌జోహార్‌ కుమారుడు కరణ్ జోహార్ . తొలిసారి ‘కుచ్‌కుచ్‌ హోతాహై’ తో దర్శకుడయ్యాడు ఆయన .. బెస్ట్‌ పాపులర్‌ సినిమాగా దీనికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు కూడా అందుకుంది. ‘కభీ కుషీ కభీ ఘమ్‌’ , ‘కభి అల్విదనా కెహనా’ , ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ , ‘ఏ దిల్‌హై ముష్కిల్‌’  తదితర చిత్రాలు కరణ్‌ క్రియేటివిటీకి నిలువెత్తు నిదర్శనాలు . బిఫోర్ లాస్టియర్  ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘రాజీ’, ‘ధడక్‌’, ‘సింబా’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలు అందుకున్న కరణ్‌.. లాస్ట్ ఇయర్  ‘కేసరి’ చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘కళంక్‌’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈ స్టార్‌ డైరెక్టర్‌ కం ప్రొడ్యూసర్‌ ‘గుడ్‌ న్యూస్‌’, ‘డ్రైవ్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘తఖ్త్‌’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈయన బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. నేడు కరణ్ జోహార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సృజనకు జోహార్ అంటూ .. శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!