Kannappa : మంచు విష్ణు హీరోగా నటిస్తున్న “కన్నప్ప” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తి డివోషనల్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది . అద్భుతమైన విజువల్స్, అబ్బుర పరిచే యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ఓ ఘనతను సృష్టించింది.

20 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటింది “కన్నప్ప” టీజర్.  అక్షయ్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తో పాటు భారీ తారాగణం తో ఈ చిత్రం రూపొందుతోంది. “కన్నప్ప” సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!