శంక‌ర్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అత్యంత భారీ బ‌డ్జెట్ మూవీ రోబో… శివాజీ లాంటి హిట్ త‌ర్వాత శంక‌ర్, ర‌జినీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ అప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండియాలో వున్న రికార్డ్స్ అన్నింటినీ చెడిపేసింది. ఇంత భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించిన ఈ మూవీలో శంక‌ర్ అనుకున్న హీరో క‌మ‌ల్ హ‌స‌న్‌, హీరోయిన్ ప్రీతిజింతా. ఈ కాంబినేష‌న్ ని అనుకోవ‌డ‌మే కాదు ఫోటో షూట్ కూడా చేసారు. అయితే అదే టైమ్ లో త‌మిళ,తెలుగులో హిట్ అయిన ఒకే ఒక్క‌డు చిత్రాన్ని బాలీవుడ్‌లో అనిల్ క‌పూర్ హీరోగా నాయ‌క్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత క‌మ‌ల్‌తో రోబో మూవీ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఆ టైమ్‌లో క‌మ‌ల్ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యాడు. సో డేట్స్ ప్రాబ్లెమ్ రావ‌డం వ‌ల్ల శంక‌ర్ రోబో మూవీ ఆపేసి త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ బోయ్స్ తీసాడు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రూ రోబో మూవీ చేయాల‌ని ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ డేట్స్ ప్రాబ్లెమ్స్ వ‌ల్ల చేయ‌లేక‌పోయారు. 2007 లో రోబోను తెర‌కెక్కించాల‌ని డిసైడ్ అయి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ను క‌న్స‌ల్ట్ చేసాడు శంక‌ర్‌. అయితే కొన్ని క్రియేటివ్ రీజ‌న్స్ వ‌ల్ల షారుక్ చేయ‌లేక‌పోయాడు. ఇక షారుక్‌, క‌మ‌ల్ ల త‌ర్వాత ర‌జినీతో రోబో చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేసాడు. ర‌జినీ డేట్స్‌తో పాటు అన్నీ కుద‌ర‌డంతో ఆ త‌రువాత రోబో ఎంత‌టి హిస్ట‌రీ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే.

Leave a comment

error: Content is protected !!