Janvi Kapoor : సినీ నటీనటులు తమ పాత్రల కోసం ఎంతలా శ్రమిస్తారో చూస్తూనే ఉంటాం. కానీ.. జాన్వీ కపూర్ తన కొత్త సినిమా “మిస్టర్ అండ్ మిస్సెస్ మహి” కోసం చూపించిన డెడికేషన్ మాత్రం అద్భుతం. ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటించేందుకు జాన్వీ ఏకంగా 150 రోజుల పాటు శిక్షణ తీసుకుంది. 30 రోజులకు పైగా సినిమా షూటింగ్ లో క్రికెట్ సన్నివేశాలలో పాల్గొన్న జాన్వీ, ఈ సాధనలో రెండు సార్లు గాయపడింది కూడా.
“మిలీ” సినిమా షూటింగ్ సమయంలోనే “మిస్టర్ అండ్ మిస్సెస్ మహి” కోసం శిక్షణ ప్రారంభించిన జాన్వీ, తన కోచ్ ల సహాయంతో ఒక నిజమైన క్రికెటర్ గా మారింది. సినిమాలో చాలా వరకు VFX ద్వారా క్రికెట్ సన్నివేశాలను చిత్రీకరించవచ్చు అయినప్పటికీ, దర్శకుడు శరణ్ శర్మ మాత్రం ప్రతి ఒక్క సన్నివేశం సహజంగా కనిపించాలని కోరుకున్నాడు. దీంతోనే జాన్వీ కు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో గాయాలు, భుజం నొప్పులు భరించిన జాన్వీ, సినిమా విడుదల తర్వాత వచ్చే ప్రశంసలన్నీ తన కోచ్ లకు చెందుతాయని చెప్పడం మాత్రం మనకు గుర్తుంచుకోవల్సిన విషయం. “ఎన్నో సార్లు ఈ సినిమా నుండి వైదొలగాలని అనుకున్నాను. కానీ నా కోచ్ లు నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు” అని చెప్పిన జాన్వీ, ఈ సినిమా తనకు ఎంతో గుర్తుండిపోతుందని తెలియజేసింది.