Shopping Cart 0 items - $0.00 0

‘ఆర్.ఆర్.ఆర్‘ షూటింగ్ లో నేడే అజయ్ దేవ్ గణ్ జాయినింగ్

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న క్రేజీ  మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ ఫిక్షనల్ హిస్టారిక్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  దాదాపు రూ.450కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది (సినిమా అక్టోబర్ కు వాయిదా పడిందనే రూమర్స్ ఉన్నాయి).

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి సంబంధించి రోజుకో అప్డేట్ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  ఈ రోజు కూడా అలాంటి ఓ సూపర్ అప్డేట్ వచ్చేసింది. నేడు ప్రారంభం కానున్న ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ షూటింగ్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్ గణ్ జాయిన్ అవుతున్నాడు. ఇందులోయన్టీఆర్, చరణ్ లతో పాటు  అజయ్ కూడా ఒక  పవర్ ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ గా నటించనున్నాడని ఇదివరకే వార్తలొచ్చాయి.  తారక్, చెర్రీ పాత్రలతో పాటు .. అజయ్ దేవ్ గణ్ పాత్ర కూడా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. 1920 లో జరిగిన స్వాతంత్ర్య సమరం బ్యాక్ డ్రాప్ లో  .. ఫిక్షనల్ పాత్రలతో రాజమౌళి .. ప్రపంచవ్యాప్తంగా విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. మరి అజయ్ దేవ్ గణ్ పాత్ర ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి ఏ రేంజ్ లో  అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.   

 

Leave a comment

error: Content is protected !!