Shopping Cart 0 items - $0.00 0

సంక్రాంతి మొనగాళ్ళు రామ్ లక్ష్మణులు

 

ఈ సంక్రాంతికి ‘*దర్బార్, సరిలేరు నీకెవ్వరు , అల వైకుంఠపురములో’’ చిత్రాలతో రజనీకాంత్, మహేశ్ బాబు , అల్లు అర్జున్ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అయ్యారు.   వీటిలో ‘ఆల్రెడీ దర్బార్’ చిత్రం  హిట్ టాక్ ను సొంతం చేసుకుంది . ఇక ‘సరిలేరు నీకెవ్వురు , అల వైకుంఠ పురములో’ చిత్రాలు వరుసగా విడుదలయ్యేందుకు రెడీ గా ఉన్నాయి. అయితే  ఈ మూడు చిత్రాలకూ ఓ ఆసక్తికరమైన కామన్ పాయింట్ ఉంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ మూడు చిత్రాల ఫైట్స్ ను కంపోజ్ చేసింది కవల స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కావడం విశేషం. ‘దర్బార్’ లో రజనీకాంత్ చేత ఆ వయసులో కూడా  స్టైలిష్ ఫైట్స్ ను కంపోజ్ చేసి.. శభాష్ అనిపించుకున్నారు.

ఇక ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీలో కూడా రామ్ లక్ష్మణ్ సోదరులు .. మహేశ్ బాబు చేత అబ్బుర పరిచే విన్యాసాల్ని చేయించారనే టాక్స్ వినిపిస్తున్నారు.  ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే కొండారెడ్డి బురుజు దగ్గర ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.  అలాగే క్లైమాక్ ఫైట్ కూడా జనాన్ని బాగా థ్రిల్ చేస్తుందని టాక్.  ఇక .. అల్లు అర్జున్ ‘అలవైకుంఠ పురములో’  మూవీ కి కూడా రామ్ లక్ష్మణుల పవర్ ఫుల్ ఫైట్స్ కంపోజ్ చేశారని వినికిడి. అసలే బన్నీ స్టైలిష్ స్టార్ .. అతడికి ఈ స్టైలిష్ స్టంట్స్ సోదరులు కూడా తోడైతే.. మెగా అభిమానులకు అది మరో సంక్రాంతే . మొత్తం మీద ఈ సంక్రాంతికి  అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్నప్పటికీ .. తామే  ఈ సంక్రాంతికి మొనగాళ్ళమని రామ్ లక్ష్మణులు  నిరూపిస్తున్నారన్నమాట.

Leave a comment

error: Content is protected !!