మాస్ రాజా రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మూవీ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. అనిల్ స్టైలాఫ్ కామెడీ ఎంటర్ టైనర్ కు మాస్ రాజా  కామెడీ టైమింగ్ తోడవడంతో .. రవితేజ కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డు కెక్కింది. అలాంటి  ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డ్ కు తెరతీసింది. అదేంటంటే.. ఇందులో రవితేజ , కథానాయిక మెహ్రీన్ బంధువుల మీద చిత్రీకరించిన గున్నా గున్నామామిడి  సాంగ్ .. ఇప్పుడు రికార్డ్ వ్యూస్ సాధించింది.

2017 అక్టోబర్ 18న విడులైంది రాజా ది గ్రేట్ చిత్రం. ఈ సినిమాకి సాయి కార్తిక్ క్యాచీ ట్యూన్స్ అందించాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా  అదరగొట్టాడు. ఎస్పెషల్లీ ఇందులోని గున్నా గున్నా మామిడి పాట అందరినీ ఎంతగానో అలరించింది. ఈ పాట..  ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో 100 మిలియన్స్ వ్యూస్  మార్క్ ను టచ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఈ చిత్ర బృందం భలే ఖుషీ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ రికార్డ్ గురించి ఓ రేంజ్ లో ట్వీట్స్ వచ్చిపడుతున్నాయి.  

Leave a comment

error: Content is protected !!