మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అభిమానులు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్.. రెండు రోజుల షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లాడు. షూటింగ్ పూర్తి చేసి నేడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాటిక్ వెంచర్‌పై మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

Leave a comment

error: Content is protected !!