ఏడిద నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతల్లో ఉన్నతమైన అభిరుచి గల నిర్మాతగా పేరు పొందారు.  దానికి కారణం ఆయన అందించిన గొప్ప చిత్రరాజాలు. ‘శంకరాభరణం‘, ‘సాగరసంగమం‘, ‘స్వయంకృషి‘, ‘స్వాతిముత్యం‘, ‘ఆపద్భాంధవుడు‘, ‘సితార‘ , ‘సీతాకోకచిలుకమొదలగు కళాత్మక దృశ్య కావ్యాలను నిర్మించి వాటి ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి అందించిన ఘనత ఆయనది. ఆయన స్థాపించినపూర్ణోదయా మూవీ క్రియేషన్స్సంస్థ పేరు చూసే ప్రేక్షకులు ఈయన సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారంటే అతిశయోక్తి కాదు. మారుతున్న కాలానుగుణంగా ఎన్నో వైవిధ్యమైన పుంతలు తెలుగు తెరపై రాణిస్తున్న రోజుల్లో కేవలం తాను కట్టుబడిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఎక్కడ కూడా అపహాస్యం, అశ్లీలతలకు చోటు ఇవ్వనివి ఈయన సినిమాలు. నేడు ఆయన 87 జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలను గురించి గుర్తు చేసుకుందాం

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్, సురేష్ ప్రొడక్షన్స్ అధిపతి డి.రామానాయుడు వారి కోవలోకే వస్తారు పూర్ణోదయ సంస్థ యజమాని ఏడిద నాగేశ్వరరావు. ఎందుకంటే ఈయన కూడా ముందుగా వారిలానే నటులుగా వెండితెరపై రాణించాలని వచ్చి, తర్వాత అగ్ర నిర్మాతలుగా తెలుగు సినిమా పరిశ్రమలో రాణించిన వారిగా పేరు పొందారు. అయితే ఇద్దరు కూడా కమర్షియల్ సక్సెస్ కోసమే ఎక్కువగా సినిమాలు తీశారు. కానీ, ఏడిద నాగేశ్వరరావు మాత్రం సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా, తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి తమపూర్ణోదయసంస్థను జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సినిమాలను నిర్మించారు. అంతేకాదు చివరివరకు కూడాను తాను నమ్మిన విలువలనే ఆచరిస్తూ సాగిన ఏడిదశంకరాభరణంనిర్మాతగా నిలిచిపోయారు.

సిరిసిరి మువ్వవిజయంతో ఏర్పడినపూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్‘ :

ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934 , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు. ఏడిద నాగేశ్వరరావుకు కాలేజీ రోజుల నుండి నాటకాల్లో ఉన్న అనుభవంతో నటన పై మక్కువ ఏర్పరచుకుని నటుడు అవ్వాలనుకుని మద్రాస్ చేరిన ఆయనకు చివరికి నిరాశే మిగిలింది. ఇక చేసేదేమి లేక సినిమా రంగంలోనే స్థిరపడి తొలినాళ్లలో వచ్చిన చిన్నా చితకా వేషాలు వేస్తూ, కొన్ని సినిమాలకు డబ్బింగులు కూడా చెప్పేవారు. మిత్రుల ప్రోత్సాహంతోసిరిసిరి మువ్వచిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు. విజయం ఇచ్చిన ఉత్సాహంతోపూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్సంస్థను స్థాపించి మొదటి చిత్రంగాతాయారమ్మ బంగారయ్యచిత్రాన్ని నిర్మించారు . సినిమా మంచి విజయం సాధించింది.

తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకు వెళ్లినశంకరాభరణం‘ :

తర్వాత కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినశంకరాభరణంసినిమా తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యంగా నిలిచింది. చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు, బాక్సాఫీస్ కలెక్షన్స్ గానీ, జాతీయఅంతర్జాతీయరాష్త్ర అవార్డులు  గానీ మరే సినిమాకీ రాలేదంటే, అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రంగాశంకరాభరణంనిలిచింది. అలాగే దేసేమెళ్లినాశంకరాభరణంగురించి ప్రస్తావనే అప్పట్లో. సినిమా సాధించిన విజయం అలాంటిది మరీ. ఎక్కడికి వెళ్ళినా నాగేశ్వరరావునుశంకరాభరణంనిర్మాత అని పిలిచేవారు. అందుకే ఆయన హైదరాబాద్ లో కట్టుకున్న ఇంటికిశంకరాభరణంఅని పేరు పెట్టుకున్నారు.

 

యువ ప్రేమకథలతో తెరకెక్కే సినిమాలకి ట్రెండ్ సెట్టర్  సీతాకోకచిలుక‘ :

తర్వాత తమిళ దర్శకుడు భారతీరాజా తో చేసిన  సీతాకోకచిలుకఅప్పుడు ఇప్పుడు కూడా  ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. దానికి కారణం ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కథా చిత్రాలకుసీతాకోకచిలుకసినిమాలోని కథాంశమే ఇన్స్పిరేషన్ గా తీసుకుని వస్తూనే ఉన్నాయి.

కళాతపస్వి కె. విశ్వనాథ్కమలహాసన్ కాంబోలో రెండు సినిమాలు :

కమలహాసన్, జయప్రద జంటగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా  సాగర సంగమం‘. సినిమా తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. సినిమా అవార్డులతో పాటు రివార్డులు సొంతం చేసుకుంది. ఇదే కాంబినేషన్ లో  తర్వాత వచ్చిన  స్వాతిముత్యంసినిమా ఆణిముత్యంగా నిలిచింది. 1986 లో విడులయ్యిన చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం.‘సాగరసంగమం’ “ స్వాతి ముత్యంచిత్రాలకి ఎన్నో అంతర్జాతీయ ,జాతీయ ,రాష్ట్ర బహుమతులు వరించాయి . అలాగే ఇప్పటివరకూ ఆస్కార్ కి నామినేషన్ కి వెళ్లిన ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం.

వెండితెరసితార‘ :

ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో వచ్చిన మరో క్లాసిక్ సినిమాసితార‘. ఏడిద నాగేశ్వరరావు వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన సినిమాసితార‘. సినిమా భానుప్రియకు తోలి సినిమా. సినిమా కూడా జాతీయ స్థాయి అవార్డుల్లో సత్తాచాటింది.

కళాతపస్వి కె. విశ్వనాథ్చిరంజీవి కాంబోలో రెండు సినిమాలు :

కమర్షియల్సినిమా హవా నడుస్తోన సమయంలోచిరంజీవి ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తున్న రోజులవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తో కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, చిరంజీవి వంటి స్టార్ హీరోను సాధారణ చెప్పులు కొట్టుకునేసాంబయ్యపాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమనే చెప్పాలి. అలా సాహసించి చేసిన సినిమా విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద. కథ చిరంజీవిని ఆకట్టుకోవడమే కాకుండా తెలుగోడు లెత్తుకునేలా గొప్పవిజయం సాధించింది. అలాగే సినిమా చిరంజీవికి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డును తెచ్చిపెట్టింది. సినిమా అప్పట్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. తర్వాత దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. సినిమా రష్యన్భాషలోకి అనువాదమైంది. అంతకు ముందు ఆయన చిత్రాలన్నీ రష్యన్ భాషలోకి అనువదించి గొప్ప విజయాన్ని సాధించాయి. మళ్ళీ విశ్వనాధ్చిరంజీవిలతో తీసిన సినిమాఆపద్బాంధవుడు‘. సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి కథానాయిక, అప్పటి వరకు రచనలు, దర్శకత్వం చేసే జంధ్యాల తెరపై కనిపించడం విశేషం. సినిమా చిరంజీవి నట విశ్వరూపానికి మంచి ఉదాహరణ. రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి , మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే ఉత్తమ అభిరుచి గల సినిమాలను ఇష్టపడే అభిమానులకు ఇప్పటికి అది నిరాశగానే మిగిలింది.

ఫలించని కుమారుడు ప్రయత్నం :

ఏడిద నాగేశ్వరరావు రెండో కుమారుడు శ్రీరాం హీరోగా చేసినస్వరకల్పనఆశించనంతగా ఆడలేదు.

ఏడిద నాగేశ్వరరావు తీసిన 10 సినిమాలు కళా ఖండాలేఆయన జయంతి సందర్భంగా ఘననివాళులు అందిస్తుంది మూవీ వాల్యూం.

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్పై నిర్మించిన సినిమాలు :

సిరి సిరి మువ్వ

తాయారమ్మ బంగారయ్య

శంకరాభరణం

సీతాకోకచిలక

సాగర సంగమం

స్వాతిముత్యం

సితార

స్వయంకృషి

స్వరకల్పన

ఆపద్బాంధవుడు

error: Content is protected !!