Dulquer Salman : మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూకుడుగా దూసుకు పోతున్నాడు. తమిళ డబ్బింగ్ సినిమా “కనులు కనులు దోచాయంటే” తో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ హీరో, ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమాలు చేస్తూ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో “లక్కీ భాస్కర్” అనే సినిమాలో నటిస్తున్న దుల్కర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమాకు ఓకే చెప్పాడు.

ఆగస్ట్ లో విడుదల కానున్న “లక్కీ భాస్కర్” తర్వాత, పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించే సినిమాలో నటించనున్నాడు. వైజయంతి మూవీస్ తో దుల్కర్ కి గట్టి అనుబంధం ఉంది. “మహానటి” తో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యానర్, “సీతారామమ్” తో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలతో దుల్కర్-వైజయంతి మూవీస్ కాంబినేషన్ పై మరింత నమ్మకం ఏర్పడింది.

Leave a comment

error: Content is protected !!