Shopping Cart 0 items - $0.00 0

‘ఫ్రీక్ అవుట్’ అయిన ’డిస్కోరాజా‘

మాస్ మహారాజా రవితేజ .. తాజా చిత్రం ‘డిస్కోరాజా’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన టీజర్స్, లిరికల్ సాంగ్స్ తో ప్రచార హంగామా చేసిన చిత్ర బృందం రీసెంట్ గా ఇందులోని ‘ఫ్రీక్ అవుట్’ అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది.  ప్రతీ సినిమాలోనూ రెగ్యులర్ గా కనిపించే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ కు చాలా భిన్నంగా ఈ పాట సాగుతుంది. పల్లవి , చరణం  ఏమీ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రవితేజ  మాటలతోనే డిఫరెంట్ గా ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు తమన్. ఈ వీడియో సాంగ్ కు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

ఈ పాటలో రవితేజ బెల్ బాటమ్ గెటప్ పీరియాడిక్ నేపథ్యాన్ని గుర్తుకు తెస్తోంది. అలాగే అతడు  పలికే ఇంగ్లీష్ డైలాగ్స్ .. యాక్షన్ , యాక్టింగ్ అన్నీ చాలా స్లైలిష్ గా ఉన్నాయి. ఇంకా విలన్ బాబీ సింహా నటించిన కొన్ని సన్నివేశాల మీదా, సునీల్ డైలాగ్స్ మీదా ఫ్రీక్ అవుట్ సాంగ్ సాగుతుంది.  అసలు  ట్రైలర్ గా కాకుండా .. అందులో కట్ చేసిన సీన్స్ కు   ఇలా సాంగ్ రూపం ఇచ్చాడేమో తమన్ అనిపిస్తుంది. మొత్తం మీద మాస్ మహారాజా బాగానే ఈ  వీడియో సాంగ్ తో ఫ్రీక్ అవుట్ అయ్యాడు.  మరి ఈ సాంగ్ థియేటర్స్ లో  ఏ రేంజ్ లో పేలుతుందో చూద్దాం.

వీడియో సాంగ్ కోసం కింద లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=fx6tBzBJKV0&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!