Akhanda 2 : నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మూవీ అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీనివాసు, సీక్వెల్ ఖచ్చితంగా రాబోతోందని స్పష్టం చేశారు. అయితే.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వం మారడంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం పై కొన్ని సన్నివేశాలు రాసినట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా శైవత్వం పై సాగుతుందని సమాచారం. హిందూత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. హిందూ దేవాలయాలు, దక్షిణ భారతదేశం గొప్పతనం గురించి ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని నమ్ముతున్నారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a comment

error: Content is protected !!