Devara Trailer : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర పార్ట్ 1. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను వదిలారు మేకర్స్. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

అద్భుతంగా కట్ చేసిన ట్రైలర్‌తో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణ. ఒకవైపు ధైర్యవంతుడైన దేవరగా, మరోవైపు సౌమ్యుడిగా అతని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.
భయం అనే పదానికి అర్థం తెలియని భైర అనే విలన్‌ను ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే సవాళ్లు, అతనిలోని రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ కథలోని ముఖ్య హైలైట్స్. ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతో థ్రిల్ చేస్తున్నాయి . ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సొరచేపతో సవారి చేసే సీన్ అంతా హైలైట్. ఈ సీన్‌తో పాటు మరెన్నో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు కళ్ళకు విందుగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్‌ అద్భుతమైన కెమెరా వర్క్‌తో చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!