Shopping Cart 0 items - $0.00 0

ఒకే రోజు బాలయ్య డబుల్ ధమాకా

తెలుగు ఇండ‌స్ట్రీలో బాలయ్య స్టైల్ సెప‌రేట్‌. ప్ర‌త్యేక‌మైన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివ‌రీ, ఎన‌ర్జిటిక్ ప‌ర్‌ఫార్మెన్స్‌, న‌వ‌ర‌సాల‌ను త‌న‌దైన శైలిలో పండించే నేర్పు బాల‌య్య‌ను మిగ‌తా హీరోల‌కంటే డిఫ‌రెంట్ అనిపించేలా చేస్తాయి. మాస్ ఆడియెన్స్‌లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు బాల‌య్య‌. మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు, రాముడు భీముడు, లారీ డ్రైవ‌ర్‌, రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌, భైర‌వ‌ధ్వీపం, బంగారు బుల్లోడు, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ నాయుడు, సింహ‌, లెజెండ్ లాంటి సినిమాలు బాల‌య్య మాస్సివ్ స‌క్సెస్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి. బాల‌య్య ఖాతాలో డిఫ‌రెంట్ రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఓ రికార్డ్ మాత్రం చాలా స్పెష‌ల్ . మిగ‌తా హీరోల‌కు లేని రికార్డ్ బాల‌య్య‌కు మాత్రమే సాధ్య‌మైంది.
1993లో బాల‌య్య బంగారు బుల్లోడు మూవీతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అదే సంవ‌త్స‌రం అదే రోజు విజ‌య‌శాంతి ఫీమేల్ లీడ్‌తో నిప్పుర‌వ్వ కూడా చేసాడు బాల‌య్య‌. ఈ రెండు సినిమాలు 1993 సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ అయ్యాయి. నిప్పుర‌వ్వ‌కు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ కెరీర్ స్టార్టింగ్ పొజిష‌న్ కాబ‌ట్టి ఆర్ ఆర్ మాత్రం చేసాడు. అయితే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగారు బుల్లోడు సూప‌ర్ హిట్ కాగా, హిట్ పెయిర్ ఉన్న యాక్ష‌న్ మూవీ నిప్పుర‌వ్వ మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. ఒక పెద్ద స్టార్ కు సంబంధించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం నిజంగా రికార్డే. ఆ రికార్డ్ బాల‌య్యతో మాత్ర‌మే మొద‌లు కావ‌డం విశేషం.

Leave a comment

error: Content is protected !!