శిల్పకవేదికలో దర్శక రత్న దాసరి 77వ జయంతిని పురస్కరించుకుని దర్శక రత్న డి.ఎన్.ఆర్.. సినిమా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్ర యూనిట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ చిత్రసీమకు ఎలాంటి సహకారం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. దాసరి లెజెండరీ అవార్డులను ఆయన అందజేశారు.

ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీలో ప్రముఖ నిర్మాత కె. కళ్యాణ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ సినీ పాత్రికేయులు ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ నిర్వహించారు. ప్రముఖ నటుడు ప్రదీప్ సమన్వయం చేసారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పది వేల మంది దాసరి టీమ్ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ప్రభు, నిహారిక తమ వ్యాఖ్యానంతో షోను హోస్ట్ చేశారు.

Leave a comment

error: Content is protected !!