అన్ని సంవవత్సరాలూ వేరు. ఈ 2020 వేరు . ఇది కరోనా కాలం. అందుకని ఇప్పుడు ఎలాంటి సెలెబ్రేషన్స్  చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రత్యేకించి.. స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకల్ని, ఫ్యాన్స్ ఎవరింట్లో వారు జరుపుకొనే పరిస్థితులొచ్చాయి. వచ్చేనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రాబోతోంది. ఇదివరకటిలా ఫ్యాన్స్ క్రౌడ్ గా పోగయి.. కేకులు స్వీట్లు పంచుకోడానికి,  వేడుకల్ని గ్రాండ్ గా చేయడానికి వీల్లేదు. అలాగని ఊరుకోరు కదా..  సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే మనోళ్ళు సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టేశారు.

ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ప్రతీ హీరో పుట్టినరోజుకు ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ విడుదల చేయడం ఆనవాయితీ. అయితే మెగాస్టార్ చిరంజీవి సీడీపీను ఒక బాలీవుడ్ స్టార్ హీరో చేత విడుదల చేయించబోతున్నారు మెగాస్టార్ అభిమానులు. అలాగే చిరంజీవి మీద ఒక పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే   తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ప్రస్తుతం నటిసోన్న ‘ఆచార్య’ సినిమా అప్డేట్ కూడా విడుదల కాబోతోందని సమాచారం. అప్పటి పరిస్థితిని బట్టి ఈ చిత్ర మోషన్ పోస్టర్ లేదా టైటిల్ లోగో లేదా రెండూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Leave a comment

error: Content is protected !!