Shopping Cart 0 items - $0.00 0

నీలాంబరిని మిస్సయిన మీనా

 

ర‌మ్య‌కృష్ణ‌.. ఈ స్టార్ చేసిన సినిమాల్లో వ‌న్ ఆఫ్ ది మెమ‌ర‌బుల్ హిట్ న‌ర‌సింహ‌. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ ప్లే చేసిన నీలాంబ‌రి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అంత బాగా చేసి శెభాష్ అనిపించుకుంది. ఒక్క‌సారి ఆలోచిస్తే నీలాంబ‌రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ కాకుండా వేరే వాళ్లుండుంటే..విష‌యంలోకి వెళ్తే.. నర‌సింహ మూవీలో నీలాంబ‌రి జ‌మిందారీ కుంటుంబంలో పుట్టిన ఓ పొగ‌రుబోతు అమ్మాయి. డబ్బున్న హుందాత‌నం, హోదా తెచ్చే అహంకారం, అందం ఇచ్చే పొగ‌రు ఇన్ని షేడ్స్ ఆ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాలి. ఈ క్యారెక్ట‌ర్‌కోసం డైరెక్ట‌ర్ కె.ఎస్ ర‌వికుమార్‌, సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌లు కొంత‌మంది పేర్ల‌ను ప‌రిశీలించార‌ట‌. ర‌జినీ హీరోయిజంను ఢీకొట్టగ‌లిగే లేడీ విల‌నిజం కావాలి. అందుకోసం కొంత‌మంది హీరోయిన్ల‌ను అనుకున్నారు. అయితే ఆ పేర్ల‌లో ముందుగా ప‌రిశీలించిన పేరు మాత్రం ర‌మ్య‌కృష్ణ‌ను కాదు. ర‌జినీకాంత్‌తో ముత్తులో యాక్ట్ చేసి, థిల్లానా థిల్లానా అంటూ స్టెప్పులేసిన సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ మీనాను ఈ క్యారెక్ట‌ర్‌కు అనుకున్నార‌ట‌. అంతే కాదు ర‌జినీకాంత్ స్వ‌యంగా ఫోన్ చేసి నీలాంబ‌రి క్యారెక్ట‌ర్ చేస్తున్నావ‌ని చెప్పాడ‌ట‌. కానీ ఆ టైమ్‌లో మీనా తెలుగు, త‌మిళ్, క‌న్నడ మూవీస్ తో ఫుల్ బిజీ షెడ్యూల్‌తో వుంది. దాంతో పాటు ఈ క్యారెక్ట‌ర్‌లో నెగ‌టివ్ షేడ వుండ‌టం మీనా త‌ల్లికి న‌చ్చ‌లేద‌ట‌. డేట్స్ కూడా అడ్జెస్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో నీలాంబ‌రి క్యారెక్ట‌ర్‌ను వ‌దులుకుంద‌ట‌. ఇంత వెయిట్ వున్న క్యారెక్ట‌ర్‌ను వ‌దులుకున్నందుకు ఆ త‌ర్వాత చాలా ఫీల‌య్యార‌ట మీనా. ఆ త‌ర్వాత స‌రాసరి ర‌మ్య‌కృష్ణ‌ను ఎంపిక చేసారు. ర‌మ్య‌కృష్ణ నీలాంబ‌రిగా జీవించి ర‌జినీకాంత్‌కు ధీటుగా పేరు తెచ్చుకుంది. ఎన్ని ట్విస్టులున్నా కొన్ని క్యారెక్ట‌ర్లు ఎవ‌రికి చేరాలో వారికే చేర‌తాయి. అన్న‌ట్టు ఈ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది.. ద‌క్కేది ద‌క్క‌క మాన‌దు ద‌క్క‌నిది ఎన్న‌టికీ ద‌క్క‌దు అని. ఆ డైలాగ్‌లాగే నీలాంబ‌రి ర‌మ్య‌కృష్ణ‌కు ద‌క్కింది.

Leave a comment

error: Content is protected !!