బ్రహ్మానందం గురించి ఆయన నటించిన సినిమాల గురించి పోషించిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా కామెడీలో బ్రహ్మానందానిది ఓ డిఫరెంట్ స్టైల్, ఆయన మార్క్ హాస్యం, హావభావాలు, డ్యాన్స్ మరెవరికీ సాధ్యం కావు అన్నంతగా తెలుగు సినిమా హాస్యంపై చెరగని ముద్ర వేశారాయన. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అనే తన గురువు జంధ్యాల మాటలను పాటించే బ్రహ్మానందం.. సినిమా సినిమాకీ వైవిధ్యం చూపించేవారు. తెలుగు సాహిత్యంలో ఎం.ఏ  చేసిన తర్వాత అత్తిలిలో తొమ్మిదేళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

ఇన్నాళ్లు తెరపై హాస్య నటుడిగానే సుపరిచితమైన బ్రహ్మనందం ఈ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఆయన గీసిన చిత్రాలతో తనలోని విభిన్న ప్రతిభను బయట పెట్టారు.

బ్రహ్మనందం గీసిన చిత్రాలు:   

గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని, ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని , మదర్ థెరిస్సా చిత్రాన్ని, రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాన్ని, అయోధ్య రామ మందిరం భూమి పూజ నేపథ్యంలో అందరిని ఆకర్షించేలా రాముడిని ఆంజనేయ స్వామి హత్తుకుని ఉన్నట్లు ఉన్న అద్భుతమైన చిత్రాన్ని గీశారు.వినాయక చవితి రోజున తమ నివాసంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారుచేశారు. కొత్త ఏడాది వేళ అల్లు అర్జున్, రాణా దగ్గుబాటికి వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు. 45 రోజుల కష్టపడి పెన్సిల్‌తో గీసిన శ్రీవేంకటేశ్వరస్వామి పెయింటింగ్ స్కెచ్‌ను నూతన సంవత్సర కానుకగా పంపించారు.అలా లాక్ డౌన్ లో బ్రహ్మనందం కు సంబంధించిన ఫోటోలు పోస్ట్లు అన్ని సామాజిక మాధ్యమం లో అందరిని ఆకట్టుకున్నాయి.

బ్రహ్మానందం  పాపులర్ డైలాగ్స్:

ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్..
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రావుగారు..
నెల్లూరు పెద్దా రెడ్డి ఎవరో తెలీదా..
ఎంటి.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా..
రకరకాలుగా ఉంది మాష్టారు..
అబ్బా మీరు సిగ్గుపడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది..
నా పర్ఫార్మెన్స్ నచ్చితే ఎస్ఎమ్ఎస్ చేయండి..

వెయ్యికి పైగా సినిమాలు – లెక్కలేని అవార్డులు, రివార్డులు..

వివిధ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ  పురస్కారాన్నిచ్చింది . ఉత్తమ హాస్యనటుడిగా అయిదు నంది అవార్డులు, ఓ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్రహ్మానందం ..ఇక గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాల్లో కనిపించడం లేదు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల… వైకుంఠపురంలో… సినిమాలోని రాములో రాములా పాటలో అలా కొన్ని సెకన్లు తెరపై కనిపించారు. ప్రస్తుతం అయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది చాలా ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది. మరాఠీ భాషలో మంచి హిట్ అయిన నటసామ్రాట్‌ సినిమాకి ఇది రీమేక్.

తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచుతూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. బ్రహ్మ సృష్టించిన ఆనందబ్రహ్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీవాల్యూం & టీం.

 

Leave a comment

error: Content is protected !!