ఇండియాలో కరోనా మహమ్మరిని కట్టడికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడం లేదు. ఇది కొంతమందికి కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. కొందరు మాత్రం ఈ సమయాన్ని ఫ్యామిలితో బాగా ఎంజాయ్ చేస్తు గడుపుతున్నారు. కాని కొందరు మాత్రం సమాజ సేవకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి శిఖా మల్హోత్ర కూడా ఉన్నారు. శిఖా మల్హోత్ర తన సమయాన్ని సమాజ సేవకు కేటాయిస్తున్నారు. సమాజ హితం ఆమె నర్సుగా మారిపోయారు.
మహారాష్ట్ర.లో కరోనా పాజిటివ్ కేసుల బాధితులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ డాక్టర్లు, నర్సుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమందికైనా వైద్య సేవలు అందించేందుకు శిఖా మల్హోత్ర నడుం బిగించింది. ఆమె గతంలో ఢిల్లీలోని వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజీలో నర్సింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మూవీ అవకాశాలు రావడంతో ఆమె వృత్తిని వదిలి సినిరంగంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆమె మళ్లీ నర్సుగా మారి సేవ చేయాలనుకున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా సెంటర్‌లో పని చేస్తున్నారు. దాంతో ఆమె నిస్వార్ధ సేవను చాలా మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాదు ఆమె తన జీవితాన్ని రిస్క్ లో పెట్టుకొని ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మరీ సేవను అందిస్తున్నారని ఆమెను వేనోళ్ళ కొనియాడుతున్నారు.