తమిళ సంగీత దర్శకుడు కమ్ హీరో విజయ్ ఆంటోనీ .. నకిలీ, డాక్టర్ సలీమ్ లాంటి చిత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యడు. ఆ పై బిచ్చగాడు చిత్రం డబ్బింగ్ వెర్షన్ తో తెలుగునాట సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత  అతడి తమిళ చిత్రాలు . వరుసగా తెలుగులోనూ అనువాదమయ్యాయి కానీ.. అందులో ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ .. మరో సినిమా తో రాబోతున్నాడు. అది బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ . ‘బిచ్చగాడు 2’ గా రాబోతున్న  ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ దాని ఫస్ట్ లుక్ ను  .. అతడి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిచ్చగాడు చిత్రానికి శశి దర్శకత్వం వహించగా.. రెండో భాగానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నిర్మాతగా వస్తున్న ఈ సినిమా తమిళంలో ‘పిచ్చైకారన్ 2’ గా  రూపొందనుంది. 2021లో ఈ సీక్వెల్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి బిచ్చగాడు 2 …. మొదటి భాగం తరహాలోనే సంచలనం అవుతుందేమో చూడాలి.

 

 

 

Leave a comment

error: Content is protected !!