నటీనటులు:
కార్తికేయ-నేహా శెట్టి-అజయ్ ఘోష్-శ్రీకాంత్ అయ్యంగార్-గోపరాజు రమణ-వెన్నెల కిషోర్-జబర్దస్త్ రామ్ ప్రసాద్-గెటప్ శీను-సత్య-రాజ్ కుమార్ కసిరెడ్డి-ఎల్బీ శ్రీరామ్ తదితరులు

సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు-సన్నీ కూరపాటి

నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని

రచన-దర్శకత్వం: క్లాక్స్

2012 లో యుగాంతం ప్రచారం ఎంత సెన్సేషన్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే.2012 లో యుగాంతం రాలేదని అందరికీ తెలిసిందే. కానీ బెదురులంక లో యుగాంతం ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసిందో బెదురులంక 2012 రివ్యూలో చూద్దాం.

కథ : 2012లో యుగాంతం రాబోతుందని టీవి ఛానెల్‌లు తెగ ప్రచారం చేస్తుంటాయి. బెదురులంక జనాలు తెగ భయపడుతుంటారు. ఈ న్యూస్‌ ఐటమ్‌ను అడ్డం పెట్టుకుని అజయ్‌ఘోష్ జనాల్ని దోచుకునే మాస్టర్‌ ప్లాన్ వేస్తాడు. అందుకు శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్‌ లు మతాన్ని అడ్డుపెట్టుకుని సహకరిస్తారు. ఈ స్కామ్‌ సక్సెస్‌ఫుల్ గా అమలు చేస్తున్న టైమ్‌లో సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ కోసం ఎవ్వరినైనా ఎదిరించే కార్తికేయ ఆ ఊరికి రావడం నేహాశెట్టితో లవ్‌స్టోరీ సక్సెస్‌ చేసుకునే క్రమంలో ఈ స్కామ్‌ లో భాగంగా ఊరినుంచ వెలివేయబడతాడు. అక్కడి నుంచి కార్తికేయ రివర్స్ మాస్టర్ ప్లాన్ అమలు చేసి యుగాంతం స్కామ్‌ ను ఎలా బయటపెట్టాడనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ : 2012 లో యుగాంతం వస్తుందని బ్రహ్మంగారు చెప్పింది జరగబోతుందని, నోస్ట్రడామస్ ముందే చెప్పాడని ఇలా ఎవరికి తోచిన న్యూస్‌ తో సెన్సేషన్‌ క్రియేట్ చేసారు. తీరా హాలీవుడ్‌ లో యుగాంతం అనే సినిమా వచ్చింది కానీ యుగం మాత్రం అంతం కాలేదు. అయితే టీవి చానెల్‌ టీఆర్పీకి బాగా ఉపయోగపడిన యుగాంతం కాన్సెప్ట్‌ను ఓ ముగ్గురు స్వార్ధపరులు అడ్డం పెట్టుకుని ఆ ఊరి జనాలను దోచుకోవడానికి ప్లాన్ వేయడం.. ఆ ప్లాన్‌ ని హీరో తిప్పికొట్టడం.. ఇదంతా చదివే వారికి మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. కాకపోతే విజువలైజ్ చేసినపుడు మాత్రం ఒక్క లైన్ చూట్టూ తిప్పి తిప్పి తీసిన సాగతీతలా అనిపిస్తుంది. కార్తికేయ చూడ్డానికి బాగున్నాడు. కేవలం హీరో చుట్టూ మొత్తం కథ తిరగకుండా కథలో హీరో భాగమయ్యేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు క్లాక్స్‌. అంతవరకు బాగానే ఉంది.. డీజె టిల్లుతో పెరిగిన నేహాశెట్టి క్రేజ్‌ను ఈ సినిమాలో చిత్ర పాత్రతో పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది. సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపించినా ఆ పాత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కార్తికేయ, నేహాశెట్టి హీరో హీరోయిన్లే కానీ.. అసలు ఈ కథను పూర్తిగా భుజానవేసుకుని నడిపించింది మాత్రం అజయ్‌ఘోష్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆటోరాంప్రసాద్‌ పాత్రలే. సెకండాఫ్ లో సత్య, వెన్నెల కిషోర్‌లను దింపినా.. వారి స్టామినా కు తగ్గ కామెడీని పండించడంలో మాత్రం సక్సెస్‌ కాలేదు డైరెక్టర్‌. పూర్తిగా గోదావరి పరిసరాల్లో తీసిన ఈ సినిమా విజువల్‌గా ఆహ్లాదంగా అనిపిస్తుంది. లంక గ్రామాల్లో ప్రజల మనోభావాల్ని అద్దం పట్టినా.. సినిమాటిక్ లిబర్టీతో ఆ కాస్త ఫీల్‌ ను కూడా చెడగొట్టినట్టయింది.

టెక్నికల్ టీమ్‌ : ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ , మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ ప్రధాన బలం. కానీ పాటల విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ అంత ఇంపాక్ట్‌ క్రియేట్ చేయలేకపోయాడు. డైలాగ్స్ విషయంలో క్లాక్స్‌ కు మంచి మార్కులే వేయొచ్చు. కమర్షియల్‌ టచ్‌ ఇస్తూనే ఫిలాసఫీ చెప్పాడు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ పర్లేదు.

బోటమ్‌లైన్‌ : బెదురులంక 2012  – వన్‌టైమ్‌ వాచబుల్‌

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!