Allu Arjun : ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తారనే విషయంపై అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. దానికి తగ్గట్టుగానే కొందరు దర్శకులపై కొన్ని ఊహాగానాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో దర్శకుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అతనే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్.

మరి ఈ దర్శకులతో నిజంగా సినిమాలు ఉంటాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత ఎంచుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తోంది. మరో పక్క టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పురాణాలతో ముడిపడిన కథతో బన్నీ కోసం ఒక కథను సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ఎవరి కథను ఎంచుకుంటాడు అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది. మరి పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తాడో? లేక నెల్సన్ సినిమా చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!