కామెడీలో రొమాటింక్ యాంగిల్  ను మిక్స్ చేసి.. దానికి తన గ్లామర్ ను యాడ్ చేసి.. తెలుగు ప్రజల్ని పిచ్చెక్కించే అనసూయ తాజాగా పెట్టిన ఒక పోస్టుకు  ఇప్పుడామెను తిట్టిపోస్తున్నారు. అదే పనిగా ట్రోల్ చేస్తూ.. విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. దీనికి.. ఆమె తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టులో ఏముంది? దానికి ఎందుకంతగా తప్పు పడుతున్నారు? అన్నది చూస్తే.. తెలంగాణ లాక్ డౌన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్యాకేజీని ట్యాగ్ చేస్తూ.. ఆమె ఒక విన్నపాన్ని చేశారు. మేం కూడా నెల నెలా అద్దెలు కట్టాలి. పవర్ బిల్లులు.. ఈఎంఐలు కట్టాలి. వేతన జీవులమైన మా మీదా కాస్త దయ చూపండి అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.

రంగమ్మత్త ట్వీట్ ను అర్థం చేసుకోవటం కంటే అపార్థమే ఎక్కువగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. తన ట్వీట్ లో ఆమె తన గురించి కాకుండా.. మాలాంటి వాళ్లు అన్న అర్థం వచ్చేలా చేశారు. అందులో తన గురించి కానీ.. మధ్యతరగతి.. ఎగువ మధ్య తరగతి వారి ఈతి బాధలు ఏమిటి సామీ అన్నట్లుగా ఆమె పోస్టు ఉంది. కానీ.. ఆమె ట్వీట్ కు స్పందిస్తున్న వారంతా ఆమె ట్వీట్ కు పాజిటివ్ కంటే నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. నీ సంగతే ఇలా ఉంటే.. మాలాంటి మధ్యతరగతి వారి సంగతేంటి? దేన్లో దూకి చావాలంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ.. ఆమె స్పందిస్తూ.. నేను నా గురించి చెప్పలేదు.. ‘వియు’ అన్నది వదిలేసి.. ఇలా అనేస్తారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ ధాటికి తట్టుకోలేకే  అనసూయ తన ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్ ను బ్లాక్ చేసిందట.

Leave a comment

error: Content is protected !!