యాంకరైనంత మాత్రాన గ్లామర్  ప్రదర్శించకూడదా? బుల్లి తెర అయినంత మాత్రాన బుల్లి దుస్తులు ధరించకూడదా? అన్నట్టుగా అనసూయ .. తన స్టైల్లో యాంకరింగ్ కే గ్లామర్ టచ్ ఇస్తూ తన ప్రత్యేకత చాటుకుంటోంది.. పెళ్ళై ఇద్దరి పిల్లలకు తల్లైనా సరే.. చెక్కు చెదరని సౌందర్యంతో కుర్రకారు కు నిద్రలేకుండా చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షో కి తన యాంకరింగే స్పెషల్ అట్రాక్షన్ గా మారి.. టాప్ రేటింగ్ రావడానికి తానూ ఒక కారణమైంది మన తెలుగింటి రంగమ్మత్త . ఆ షో తెచ్చిపెట్టిన పాప్యులారిటీతో .. పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి.. ఇటు బుల్లితెరమీద , అటు వెండితెరమీద తన తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ… దూసుకుపోతోంది .

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ..  రెగ్యులర్ గా తన ఫోటోస్ తో నెటిజెన్స్ కు టచ్ లోనే ఉంటూంటుంది. తాజాగా అనసూయ తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది . అందులో అమ్మడి గ్లామర్ అలా ఇలా లేదు. ఈ ఫోటోలకు లోకల్ గ్యాంగ్స్ కోసం అని కేప్షన్ కూడా ఇచ్చేసింది. పింక్ కలర్ బ్లౌజ్ విత్..  డిజెన్డ్ శారీ ధరించి.. చెవులకు వెరైటీ రింగ్స్ పెట్టుకొని..  కాస్తంత క్లీవేజ్ ప్రదర్శన చేస్తూ నవ్వుతూ పోజులిచ్చింది అనసూయ. ఈ ఫోటోకి సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ హాట్ యాంకర్, రంగమ్మత్త, ఏంజిల్ అంటూ.. రకరకాలుగా కుర్రకారు రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్ గా మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వురులో నటించి .. పండగ కానుకగా బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన అమ్మడు..  ఈ పోజులతో  ఇంకెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!