Shopping Cart 0 items - $0.00 0

అక్కినేని ‘ఏడంతస్తుల మేడ’ చిత్రానికి 40 ఏళ్ళు

 

 

అక్కినేని నాగేశ్వరరావు తన నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అందులో ‘ఏడంతస్తుల మేడ’ ఒకటి. దర్శక రత్న దాసరినారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1980, జనవరి 11న విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. సరిగ్గా నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఏఎన్నార్ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. సుజాత, జయసుధ .జగ్గయ్య, ప్రభాకరరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా కేవలం 50 రోజులకే ఒక కోటీ ఇరవై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. అప్పట్లో అక్కినేని స్టామినా ఏంటో చాటిచెప్పింది. ఇక చక్రవర్తి సంగీత సారధ్యంలో.. అరటి పండు వలిచిపెడితే తినలేని చిన్నది, ఏడంస్తుల మేడ ఇది వడ్డించని విస్తరిది, ఇది మేఘ సందేశమూ లాంటి పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. ఒక పేద వాడు కోటిశ్వరుడైతే.. ప్రేమాభిమానాల పర్యవసానం ఎలా ఉంటుందో చాటి చెప్పే కథతో మలచిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై వై. అరుణ్ ప్రసన్న నిర్మించిన ఈ సినిమా ను ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా.. అక్కినేని నాగార్జున తో రీమేక్ చేయాలని కొందరు దర్శకులు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఏదేమైనా ‘ఏడంస్తుల మేడ’ చిత్రం హీరోగా.. అక్కినేని నాగేశ్వరరావు కే కాకుండా.. దర్శకుడిగా దాసరి కి కూడా ఒక మరిచిపోలేని చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!