Shopping Cart 0 items - $0.00 0

కృష్ణ ‘అగ్నిపర్వతం’ చిత్రానికి 35 ఏళ్ళు

 

 

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అద్భుత విజయం సాధించిన చిత్రం ‘అగ్ని వర్వతం’. వైజయంతి మూవీ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మలిచిన ఈ యాక్షన్ మూవీ 1985, జనవరి 11 విడుదలై.. ఆ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో విజేతగా నిలిచింది. కృష్ణ, విజయశాంతి, రాధ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, పరుచూరి గోపాలకృష్ణ, శారద నటించిన ఈ సినిమా నేటికి సరిగ్గా 35 ఏళ్ళు పూర్తి చేసుకొంది. ఈ చిత్ర కథ వాస్తవానికి ఆఫ్రికాలోని హరారేలో పుట్టడం విశేషం. రాఘవేంద్రరావు అప్పుడు పద్మాలయా సంస్థ నిర్మించే ‘హోషియార్‌’ చిత్రం షూటింగ్‌లో అక్కడ ఉన్నారు. అందుకే పరుచూరి వెంకటేశ్వరరావుని తీసుకుని అశ్వనీదత్‌ ఆఫ్రికా వెళ్లారట. వారం, పదిరోజులు అక్కడ కూర్చుని కథ తయారు చేశారు. ఇక ఈ సినిమాలో కృష్ణ వైవిధ్యమైన రెండు పాత్రలు పోషించారు. ఈ రెండూ విభిన్నంగా ఉండేలా డిజైన్‌ చేశారు రాఘవేంద్రరావు. ముఖ్యంగా జమదగ్ని పాత్ర బాగా హైలైట్‌ అయింది. ఈ పాత్ర గెటప్‌, డైలాగ్‌ డిక్షన్‌ కోసం కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫ్రస్తుతం ఉన్న ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌కి ఎదురుగా ఉన్న కొండల్లో జమదగ్ని ఇంటికోసం పెద్ద సెట్‌వేశారు. 30 రోజుల పాటు ఊటీలో చేసిన షెడ్యూల్‌లో సాంగ్స్‌, కీలక సన్నివేశాలు తీశారు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలన్నీ ‘అగ్ని పర్వతం’ చిత్రానికి హైలైట్ గా నిలచి..చిత్ర ఘనవిజయానికి ప్రథాన కారణమైంది. ‘వన్‌ వన్‌ నెంబర్‌ వన్‌ సాంగ్‌’ని విజిపిలో తీశారు. ‘ఈ గాలిలో’ పాటని వారం రోజుల్లో ఊటీలో చిత్రీకరించారు. ఇక రగులుతున్న ‘అగ్ని పర్వతం’ పాట అయితే అగ్ని పర్వతం సినిమాకి సిగ్నేచర్ సాంగ్ అయింది.

Leave a comment

error: Content is protected !!