Adi Saikumar : యంగ్ హీరో ఆది సాయికుమార్, అందాల అవికా గోర్ జోడీగా నటించిన చిత్రం షణ్ముఖ. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదలైంది. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ పోస్టర్‌లో, ఆది సాయికుమార్ పోలీసు అధికారిగా కనిపిస్తున్నాడు. ఆయన వెనుక షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనిపిస్తుంది.

ఈ పోస్టర్ లోని థీమ్ ఆసక్తిని కలిగిస్తుంది. దర్శకుడు షణ్ముగం మాట్లాడుతూ, “ఇది ఒక విభిన్నమైన ఆధ్యాత్మిక థ్రిల్లర్. ఇంతకు ముందు ఎవ్వరూ చేయని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము” అని అన్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు.

Leave a comment

error: Content is protected !!